కిడ్నాప్ కేసులో నోటీసులు.. మంచు విష్ణు రియాక్షన్!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రముఖ హీరో మంచు విష్ణుకి తిరుచానూరు పోలీసులు కిడ్నాప్ కేసులో నోటీసులు పంపించడం సంచలనంగా మారింది.;

Update: 2026-02-08 08:12 GMT

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రముఖ హీరో మంచు విష్ణుకి తిరుచానూరు పోలీసులు కిడ్నాప్ కేసులో నోటీసులు పంపించడం సంచలనంగా మారింది. అయితే దీనిపై మంచు విష్ణు స్పందిస్తూ 15 రోజుల్లోగా విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు.

వివరాలలోకి వెళ్తే.. తిరుపతిలోని మంచు మోహన్ బాబు యూనివర్సిటీలో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ వద్ద నిరసనలకు దిగారు. దీంతో అక్కడ పెద్ద రచ్చ జరిగింది. ఇక మోహన్ బాబు యూనివర్సిటీ.. ఫీజులు పేరిట విద్యార్థులను భారీగా దోచుకుంటున్నారని, ఎస్ఎఫ్ఐ నేతలు కలెక్టరేట్ ముట్టడికి సిద్ధం అవ్వడంతో మోహన్ బాబు బౌన్సర్లు ఇద్దరు విద్యార్థి నేతలను బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారని.. అందులో అక్బర్, వినోద్ లపై బౌన్సర్లు దాడులు చేశారని ఆరోపిస్తూ.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా... విద్యార్థి నేతలను కిడ్నాప్ చేశారనే ఆరోపణలతో పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసారు.

ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ కార్ ను వెంబడించి ఘటనకు కారణమైన పలువురిపై కేసుల్ని నమోదు చేసినట్లు సమాచారం. ఇందులో మోహన్ బాబు, మంచు విష్ణు, పీఆర్ఓ సతీష్ తో సహా మొత్తం 13 మందిపై ఫిబ్రవరి 3వ తేదీన కిడ్నాప్ కేసు నమోదు అయింది. ఈ క్రమంలోనే తాజాగా పోలీసులు మంచు విష్ణుకి తిరుచానూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం తన మూవీ షూటింగ్ లకు షెడ్యూలు ఖరారు అయిపోయిందని.. ఫిబ్రవరి 15 తర్వాత విచారణకు వస్తానని లిఖితపూర్వకంగా మంచు విష్ణు చెప్పారట. ఇక మొత్తానికి అయితే కిడ్నాప్ కేసులో మంచు విష్ణుకి నోటీసులు రావడంతో ఆయన ఇలా స్పందించారు.

ఇకపోతే ఈ కేసులో ఏ1 గా పిఆర్ఓ సతీష్, ఏ2గా మంచు విష్ణు, ఏ3గా మంచు మోహన్ బాబు పేర్లను పోలీసులు నమోదు చేశారు. ఇక మరోవైపు ఇప్పటికే మంచు మోహన్ బాబు తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలి అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు మోహన్ బాబు. ముఖ్యంగా తమపై కావాలనే కొంతమంది కుట్ర పన్ని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అని కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News