తెర వెనుక క‌ట్ట‌ప్ప ఫ్యామిలీ ఎమోష‌న్!

స‌త్య రాజ్ అలియాస్ క‌ట్ట‌ప్ప గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. `బాహుబ‌లి`లో క‌ట్ట‌ప్ప పాత్ర‌తో పాన్ ఇండియాలో ఓ సంచ‌ల‌నం అయ్యారు.;

Update: 2026-02-08 07:59 GMT

స‌త్య రాజ్ అలియాస్ క‌ట్ట‌ప్ప గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. `బాహుబ‌లి`లో క‌ట్ట‌ప్ప పాత్ర‌తో పాన్ ఇండియాలో ఓ సంచ‌ల‌నం అయ్యారు. కానీ ఆ త‌ర్వాత పాన్ ఇండియా అవ‌కాశాలు అందుకోవ‌డంలో మాత్రం విఫ‌ల‌మయ్యారు. రీజ‌న‌ల్ మార్కెట్ లో మాత్రం తిరుగులేని న‌టుడాయ‌న‌. దాదాపు స్టార్ హీరోలంద‌రి చిత్రాల్లో స‌త్యరాజ్ భాగ‌మ వ్వాల్సిందే. తండ్రి..అన్న‌య్య‌..తమ్ముడు స‌హా క‌థ‌ను మ‌లుపు తిప్పే కీల‌క పాత్ర‌ల్లో స‌త్యరాజ్ క‌నిపిస్తుంటారు. న‌టుడిగా ద‌శాబ్దాలుగా కొన‌సాగుతున్నారు. న‌టుల మ‌ధ్య కాంపిటీష‌న్ ఎలా ఉన్నా? స‌త్యరాజ్ కు మాత్రం ఎలాంటి పోటీ లేదు.

కొన్ని ర‌కాల పాత్ర‌లు పోషించాలంటే అది స‌త్యరాజ్ వ‌ల్ల మాత్ర‌మే అవుతుంద‌ని మేక‌ర్స్ బ‌లంగా న‌మ్ముతారు. అందుకే ఏరికోరి మ‌రీ స‌త్యరాజ్ ను సినిమాల్లో తీసుకుంటారు. పాత్ర‌ల ప‌రంగానూ స‌త్యరాజ్ అంతే సెల‌క్టివ్ గా ఉంటారు. పెద్ద హీరో చిత్రంలో అవ‌కాశం వ‌చ్చింద‌ని తొంద‌ర ప‌డ‌రు. న‌టుడిగా ఆ పాత్ర త‌న‌కెంత గుర్తింపు తె స్తుంది? అన్న‌ది ఆలోచించే క‌మిట్ అవుతారు. ఆ ర‌క‌మైన సెల‌క్ష‌నే స‌త్యరాజ్ ను మిగ‌తా న‌టుల నుంచి వేరు చేస్తోంది. ఇదంతా తెర ముందు స‌త్య రాజ్ జీవితం. తెర వెనుక మాత్రం ఆయ‌న మ‌న‌సులో చెప్పుకోలేని స‌మ‌స్య‌లెన్నో ఉన్నాయి.

గ‌త నాలుగేళ్ల‌గా స‌త్యరాజ్ ఎంతో మానసిక క్షోభ‌కు గుర‌వుతున్నారు. స‌త్య‌రాజ్ స‌తీమ‌ణి మ‌హేశ్వ‌రికి మెద‌డులో ర‌క్త స్రావం కావ‌డంతో కొన్నాళ్ల‌గా కోమాలో ఉన్నారు అన్న విష‌యంలో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా స‌త్య‌రాజ్ కుమార్తె డైటీషియన్ దివ్య సత్యరాజ్ బ‌యట పెట్టారు. స‌రిగ్గా ఎనిమిదేళ్ల క్రితం స‌త్యారాజ్ భార్య 50 ఏళ్ల వ‌య‌సులో ఓ నిర్ణ‌యం తీసుకున్నారుట‌. భ‌ర్త‌, పిల్ల‌లు జీవితంలో స్థిర‌ప‌డిన త‌ర్వాత ఆమె నిర్మాణంలోకి రావాల‌ను కున్నారుట‌. బాగా చ‌దువుకున్న మ‌హిళ కావ‌డంతో? ఫ్యాష‌న్ తో రావాల‌నుకున్నారు. కానీ అప్ప‌ట్లో సాధ్య‌ప‌డ‌లేదు.

తొలుత స‌త్యరాజ్ తో పెళ్లికి బంధువులు అడ్డు చెప్పారుట‌. అయినా స‌త్య‌రాజ్ కు మ‌హేశ్వ‌రి తోడుగా నిలిచారు. జీవితంలో అప్ప‌టికే స్థిర‌త్వం లేక‌పోయినా న‌మ్మి వివాహం చేసుకున్నారు. అనంత‌రం స్థిర‌ప‌డే వర‌కూ చేదోడు వాదోడుగా నిల‌బ‌డ్డారు. ఆమె కు భ‌ర్త వైపు కుటుంబం ఎంత ఇష్ట‌మంటే? త‌న కోసం కాక‌పోయినా అత్తింటి కోస‌మైనా సాధించాల‌నుకున్నారు. ఈ క్ర‌మంలోనే కొన్నాళ్ల‌కు ఏకంగా అత్త‌గారి పేరు మీద‌నే నాదంబల్ ఫిల్మ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. కానీ 2020-21 లో మ‌హేశ్వ‌రి మొద‌డులో రక్తస్రావం కార‌ణంగా కోమాలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి చికిత్స అందిస్తున్నారు. భార్య‌ను స‌త్యరాజ్ ఎంతో ప్రేమ‌గా చూసుకుంటారు. షూటింగ్ అయిన వెంట‌నే నేరుగా ఇంటికెళ్లి ఆమె ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌వుతారు.

Tags:    

Similar News