'ది ఒడిస్సీ' క్లైమాక్స్ మ్యాజిక్: బాణం తీగ శబ్దంతో థియేటర్లలో గూస్‌బంప్స్

ఈ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది.. ప్రేక్షకులను కుర్చీ అంచుపై కూచోపెట్టే సీన్ ఏది అంటే అది క్లైమాక్స్ లో వచ్చే ఆ విల్లు బాణం తీగను లాగే సన్నివేశమే.

Update: 2026-07-21 16:59 GMT

ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ `ది ఒడిస్సీ` సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గ్రీకు పురాణ కథాంశంతో రూపొందిన ఈ మహోన్నత చిత్రానికి నోలన్ తనదైన మేకింగ్ హంగులు జోడించడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా థియేటర్లలో ఈ సినిమాని ఐమాక్స్ బిగ్ స్క్రీన్‌పై చూస్తున్న ప్రేక్షకులు ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అనుభూతి చెందుతున్నారు.

ఈ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది.. ప్రేక్షకులను కుర్చీ అంచుపై కూచోపెట్టే సీన్ ఏది అంటే అది క్లైమాక్స్ లో వచ్చే ఆ విల్లు బాణం తీగను లాగే సన్నివేశమే. ఏళ్ల తరబడి సముద్రాల మీదుగా సాగిన ప్రయాణంలో ఎన్నో ఘోరమైన ప్రమాదాలు, రాక్షసులు, సుడిగుండాలను దాటుకుని తిరిగి వచ్చిన ఒడిసియస్ (మ్యాట్ డామన్).. వయసు మళ్లిన చక్రవర్తిగా మారిన తర్వాత కూడా తన విల్లును సంధించిన తీరు అసాధారణం. ఆ సన్నివేశంలో ఆ బాణం తీగ నుంచి వచ్చే ప్రతిధ్వని.. దానికి ముందు థియేటర్‌లో నెలకొనే నిశ్శబ్దం ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి.

ఒడిసియస్ లేని సమయంలో ఆయన భార్య పెనెలోప్‌ను వివాహం చేసుకోవడానికి.. ఆ రాజ్యాన్ని కైవసం చేసుకోవడానికి వచ్చిన దాదాపు 100 మంది దుర్మార్గపు రాజులు, రాకుమారులు ఆ దృశ్యం చూసి ఖంగు తింటారు. ఎవరూ వంచలేని ఆ మహా విల్లును ఒడిసియస్ ఎంతో సులువుగా... తన శక్తి యుక్తులతో లాఘవంగా ఎక్కుపెట్టి తన అసలు రూపాన్ని బయటపెట్టేసరికి ఆ శత్రువులంతా భయపడి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. ఈ టిపిక‌ల్ స‌న్నివేశంలో నోలన్ పండించిన డ్రామా ప్రేక్షకులని సీటు అంచున కూర్చోబెడుతోంది.

ఏ సీజీఐ లేదా కృత్రిమ హంగుల మీద ఆధారపడకుండా ఈ క్లైమాక్స్ సన్నివేశాన్ని నోలన్ ఎంతో ప్రాక్టికల్‌గా.. వాస్తవికతకు దగ్గరగా ఆవిష్కరించిన తీరు సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ కీలకమైన క్లైమాక్స్ సన్నివేశానికి చెందిన లీక్డ్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. లీక్డ్ వీడియోలను పక్కన పెట్టి... ఈ విజువల్ అద్భుతాన్ని పెద్ద తెరపై చూసి అనుభవించాల్సిందేనని చూసిన ప్రేక్షకులు కొనియాడుతున్నారు.

ట్రోజన్ యుద్ధం ముగిసిన తర్వాత ఇథాకా రాజా ఒడిసియస్ పదేళ్ల పాటు సముద్ర ప్రయాణంలో రాక్షసులు.. మంత్ర‌గ‌త్తెతో పోరాడి.. చివరికి 20 ఏళ్ల తర్వాత వృద్ధుడి రూపంలో తన రాజ్యానికి చేరుకోవడం ఈ కథాంశం. భార్య పెనెలోప్ పెట్టిన విల్లు పోటీలో ఏ రాజు గెలవలేకపోగా... ఒడిసియస్ ఆ విల్లును సులువుగా ఎక్కుపెట్టి తన శత్రువులను అంతం చేస్తాడు. అసాధార‌ణ‌ విజువల్స్.. సౌండ్ డిజైన్... మ్యాట్ డామన్ అద్భుత అభినయం కలగలిసి `ది ఒడిస్సీ` చిత్రాన్ని 2026లోనే అత్యుత్తమ మాస్టర్‌పీస్‌గా నిలబెట్టాయి.

Tags:    

Similar News