నీల్ 'డ్రాగన్'.. తారక్ ఇంకా స్లిమ్ అవుతారా?
టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు డ్రాగన్ మూవీతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.;
టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు డ్రాగన్ మూవీతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఆ మూవీపై ఇప్పటికే అటు ఆడియన్స్ లో.. ఇటు సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అదే సమయంలో ఎన్టీఆర్ లుక్ తో పాటు ఫిట్నెస్ ట్రాన్స్ఫర్మేషన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మూవీలో రోల్ కు తగ్గట్టు కంప్లీట్ గా కొత్తగా కనిపించేందుకు ఆయన పెద్ద ఎత్తున వెయిట్ తగ్గుతున్న సంగతి తెలిసిందే. గతంలో పవర్ ఫుల్, బల్కీ ఫిజిక్ తో స్క్రీన్ పై కనిపించిన ఎన్టీఆర్.. ఇప్పుడు స్లిమ్ అండ్ షార్ప్ లుక్ లోకి మారడం అభిమానులను, మూవీ లవర్స్ ను ఇప్పటికే షాక్ కు గురి చేసింది.
రీసెంట్ గా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ కనిపించిన వీడియో కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. అందులో తారక్.. స్లిమ్ ఫిట్ బాడీ, గుబురు గడ్డం, ఇయర్ కు రింగ్, బ్లూ జీన్స్ తో పాటు హుడ్డీ ధరించి స్టైలిష్ గా కనిపించడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇదే డ్రాగన్ ఫైనల్ లుక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ లుక్స్ కు సంబంధించిన పిక్స్ వైరల్ అవ్వగా.. ఇదే ఫైనలేమోనని అంటున్నారు.
కానీ సినిమా కోసం ఎన్టీఆర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా కొనసాగుతూనే ఉందని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. మరింత సన్నగా, ఫిట్ గా మారేందుకు ఆయన స్పెషల్ డైట్, ప్రత్యేక వర్కౌట్స్ ఫాలో అవుతున్నారని సమాచారం. దీంతో ఆ విషయం తెలిసి.. సినిమాను ఓ రేంజ్ లో నీల్ ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నారని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. తమ అభిమాన హీరో ఇంకా స్లిమ్ అవుతారా అంటున్నారు.
అదే సమయంలో రోల్ కోసం ఇంత డెడికేషన్ చూపించడం తారక్ కమిట్మెంట్ కు బెస్ట్ ఎగ్జాంపుల్ అని అంతా అభిప్రాయపడుతున్నారు. నిజానికి ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరో క్యారెక్టర్లు చాలా ఇన్టెన్స్ గా, పవర్ ఫుల్ గా ఉంటాయి. అందుకే ఎన్టీఆర్ ను కూడా కంప్లీట్ కొత్త అవతార్ లో.. నెవ్వర్ బిఫోర్ అనేలా ప్రశాంత్ నీల్ ప్రెజెంట్ చేయాలని చూస్తున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది.
ఏదేమైనా లుక్ నుంచి ఫిట్నెస్ వరకు ప్రతి విషయంలో కూడా తారక్ తీసుకుంటున్న కేర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచుతోంది. ఇప్పుడు మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ లేదా టీజర్ ను రిలీజ్ చేస్తే.. సినిమాపై హైప్ మరింత పెరగడం ఖాయమని సినీ ప్రియులు చెబుతున్నారు. ఏదేమైనా అల్ట్రా స్లిమ్ అవతార్ లో ఎన్టీఆర్ మరోసారి కొత్త ట్రెండ్ సెట్ చేస్తారా? అనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.