మెగాస్టార్ తో మరో లెజెండ్ కలుస్తున్నారా?
ఇద్దరు ఒకే ప్రేమ్ లో కనిపిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. మాలీవుడ్ నటుడైనా మోహన్ లాల్ అంటే అభిమానించని తెలగు ప్రేక్షకులు ఉండరు.;
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా బాబి దర్శకత్వంలో ఓ సినిమాకు రంగం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే `మన శంకర వరప్రసాద్ గారు` షూటింగ్ పూర్తిచేసి చిరంజీవి రిలీవ్ అయిన నేపథ్యంలో బాబి కొత్త సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. చిరంజీవి కూడా వర ప్రసాద్ రిలీజ్ తో సంబంధం లేకుండా డేట్లు కూడా ఇచ్చేసారు. ఏక్షణమైనా ఈ సినిమా రెగ్యలుర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ సినిమా షూటింగ్ తో పాటు వర ప్రసాద్ ప్రచారం, డబ్బింగ్ పనులు కూడా చిరంజీవి పూర్తి చేస్తారు. సంక్రాంతి తర్వాత ఎండలు పెరుగుతాయి.
ఇంకా ముందు ముందు ఎండ తీవ్రత పెరుగుతుంది. ఈ క్రమంలో వేసవి రాకుండానే బాబి సినిమా లో తన పోర్షన్ పూర్తి చేయాలన్నది చిరు ప్లాన్. దీనిలో భాగంగా బాబి కూడా షెడ్యూల్స్ వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ఇందులో మాలీవుడ్ స్టార్ మోహన్ లాల్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు లీకైంది. ఇటీవలే బాబి..లాల్ని కలిసి ఆపాత్ర గురించి నేరేట్ చేయగా వెంటనే అంగీకరించారుట. చిరంజీవి సినిమా కావడంతో? నో చెప్పకుండా కమిట్ అయినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే వెండి తెరపై ఆ కాంబినేషన్ చూడటానికి రెండు కళ్లు సరిపోవనే చెప్పాలి.
ఇద్దరు ఒకే ప్రేమ్ లో కనిపిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. మాలీవుడ్ నటుడైనా మోహన్ లాల్ అంటే అభిమానించని తెలగు ప్రేక్షకులు ఉండరు. ఇక్కడా ఆయనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. `జనతా గ్యారేజ్` చిత్రంతో తెలుగు ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యాడు. ఆ సినిమాతో మోహన్ లాల్ పై మాస్ ఇమేజ్ కూడా మొదలైంది. ఆ తరహా పాత్రలకు లాల్ పర్పెక్ట్ గా సూటవుతారన్నది తెలుగు ప్రేక్షకుల అభిప్రాయం. `గాండీవం` సినిమాతో మోహన్ లాల్ తొలిసారి తెలుగు సినిమా చేసారు. ఆ తర్వాత చాలా కాలానికి `జనతా గ్యారేజ్` లో కీలక పాత్రతో అలరించారు.
అనంతరం `మనమంతా` అనే చిత్రంలో నటించారు. మళ్లీ ఇంత కాలానికి చిరుతో తెరను పంచుకోవడానికి రెడీ అవుతున్నారు. మరి కంప్లీట్ స్టార్ కోసం బాబి ఎంత బలమైన పాత్ర రాసాడో చూడాలి. ప్రస్తుతం మోహన్ లాల్ మాతృ భాషలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే `దృశ్యం 3` షూటింగ్ పూర్తి చేసారు. `పాట్రియోట్` అనే మరో చిత్రలోనూ న టిస్తున్నారు. అలాగే `ఖలీపా` అనే చిత్రంలో గెస్ట్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రాలన్నీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. `రామ్` అనే మరో చిత్రంలోనూ నటిస్తున్నారు. అయితే ఈ సినిమా సెట్స్ కి వెళ్లి నెలలు గడుస్తున్నా? ఇంకా షూటింగ్ దశలోనే ఉంది.