వైట్ డ్రెస్ లో హీటెక్కిస్తున్న శార్వరి..
అందులో భాగంగానే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని గ్లామర్ ఫోటోలను షేర్ చేసింది. అందులో వైట్ కలర్ బికినీను తలపించేలా డ్రెస్ ధరించిన ఈమె తన అందంతో కుర్ర కారులో హీటు పెంచింది.;
నటనతోనే కాదు అందంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఫాలోవర్స్ పెంచుకుంటున్న హీరోయిన్స్ లో ప్రముఖ నటి శార్వరి కూడా ఒకరు. 2015లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన లవ్ రంజన్ అనే చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి.. తన కెరియర్ ను మొదలు పెట్టింది..ఆ తర్వాత 2020లో వచ్చిన కబీర్ ఖాన్ యుద్ధ నాటక సిరీస్ అయిన ఫర్గాటెన్ ఆర్మీ -ఆజాదీ కే లియే ద్వారా నటనారంగ ప్రవేశం చేసిన ఈమె యష్ రాజ్ ఫిలింస్ నిర్మించిన కామెడీ చిత్రం బంటి ఔర్ బబ్లీతో సినిమా రంగంలోకి అడుగు పెట్టింది.
ఈ చిత్రం మంచి విజయం అందుకోవడంతో ఈమెకు ఉత్తమ మహిళ డెబ్యూ విభాగంలో ఫిలింఫేర్ అవార్డును గెలుచుకుంది. 2024లో కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకున్న ముంజ్యా సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అలాంటి ఈమె ఈ మధ్యకాలంలో తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
అందులో భాగంగానే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని గ్లామర్ ఫోటోలను షేర్ చేసింది. అందులో వైట్ కలర్ బికినీను తలపించేలా డ్రెస్ ధరించిన ఈమె తన అందంతో కుర్ర కారులో హీటు పెంచింది. అమ్మడి అందాలు చూసి శార్వరీ వైట్ డ్రెస్ లో మరింత హీటెక్కిస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. కొంతమంది ఫైర్ ఏమోజీలను షేర్ చేయగా.. మరి కొంతమంది టూ హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శార్వరీ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
శార్వరి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమె యష్ రాజు ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా వస్తున్న ఆల్ఫా అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆలియా భట్ అలాగే బాబీ డియోల్ కలిసి నటిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే యే ప్రేమ్ మోల్ లియా అనే చిత్రంలో నటిస్తోంది. ప్రముఖ డైరెక్టర్ సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి పనిచేయబోతోంది.
అలాగే మహా ముంజ్యాలో ఈమె భాగం కాబోతోంది. ముంజ్యా సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రాన్ని మాడాక్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. అలాగే లూకా చుప్పి 2లో కూడా నటిస్తోంది. నిజానికి ఎప్పుడో ఈ సినిమా మొదలు పెట్టాల్సి ఉండగా ఆర్థికంగా వెనకబడడం వల్లే సినిమాను కాస్త ఆలస్యం చేశారు. అలాగే రేస్ 4 తో పాటు పలు చిత్రాలలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా యాక్షన్, హారర్, కామెడీ, రొమాంటిక్ డ్రామా చిత్రాలలో నటిస్తూ బహుముఖ5 ప్రజ్ఞాశాలిగా ప్రేక్షకులను అలరిస్తోంది.