లైకులు చూసి తెగ ఫీలైపోయే న‌టి!

చిన్న వ‌య‌సులో త‌క్కువ లైకులు వ‌చ్చినా ఎంతో భారంగా ఫీల‌య్యేదాన్నంది. ఎక్కువ లైకులు వ‌చ్చిన‌ప్పుడు ఒక‌లా...త‌క్కువ వ‌చ్చిన‌ప్పుడు బాద‌ప‌డ‌టం మ‌రోలా ఉండేదంది.;

Update: 2025-12-24 18:30 GMT

నాన్ సెల‌బ్రిటీల‌కు సోష‌ల్ మీడియా ఓ వెండి తెర లాంటింది. అందులో ఫోటో పెట్టినా? పోస్ట్ పెట్టినా లైకులు ..షేర్లు చూసుకుని స‌గ‌టు నెటి జ‌నులు ఎంతో సంతోష ప‌డ‌తారు. ఆ క్ష‌ణాలు తాను ఓ సెల‌బ్రిటీలా ఫీల‌వు తుంటారు. న‌న్ను ఇంత మంది లైక్ చేస్తున్నారా? అని ఆనందంతో ఉబ్బిత‌బ్బిబితుంటారు. ఇదే ఓ సెల‌బ్రిటీ విష‌యంలో జ‌రిగితే పెద్ద‌గా రియాక్ట్ అవ్వ‌రు. అస‌లు వాటి గురించి ప‌ట్టించుకునే ప‌రిస్థితి కూడా ఉండ‌దు. ఎందుకంటే ల‌క్ష‌ల్లో త‌మ‌ని అనుస‌రించే అభిమానులంటారు కాబ‌ట్టి! లైక్స్ ని పెద్ద‌గా ప‌ట్టించుకోరు.

కానీ బాలీవుడ్ యంగ్ బ్యూటీ అన‌న్యా పాండే ఆటైపు కాదు. త‌క్కువ లైకులొచ్చినా? షేర్లు వ‌చ్చినా తెగ ఫీలైపోతుందిట‌. అందుకు ఓ ప్ర‌త్యేక కార‌ణం కూడా హైలైట్ చేసింది. అన‌న్యా పాండే చిన్న త‌నంలో ఎన్నో విమ‌ర్శ‌లు ఎదుర్కుందిట‌. త‌న వ్య‌క్తిత్వాన్ని ఎంతో మంది విమ‌ర్శించారంది. ఆ విమ‌ర్శ‌లు త‌నపై ఎంత‌గానో ప్ర‌భావం చూపించాయంది. ఇలాంటి విమ‌ర్శ‌లు త‌న‌కు మాత్ర‌మే ప్ర‌త్యేకం కాద‌ని ఆ వ‌య‌సులో ప్ర‌తీ ఒక్కరి విష‌యంలో ఏదో రూపంలో విమ‌ర్శ‌లు ఎదుర్కోక త‌ప్ప‌దంది. కాల‌క్ర‌మంలో ఎద‌గ‌డం అంటే మార‌డం అన్న విష‌యాన్ని అవ‌గ‌తం చేసుకున్న‌ట్లు తెలిపింది.

చిన్న వ‌య‌సులో త‌క్కువ లైకులు వ‌చ్చినా ఎంతో భారంగా ఫీల‌య్యేదాన్నంది. ఎక్కువ లైకులు వ‌చ్చిన‌ప్పుడు ఒక‌లా...త‌క్కువ వ‌చ్చిన‌ప్పుడు బాద‌ప‌డ‌టం మ‌రోలా ఉండేదంది. ఈ విష‌యంలో కాస్తైనా బ‌య‌ట ప‌డిందంటే? అందుకు కార‌ణం త‌ల్లిదండ్రులే అంటోంది. సోష‌ల్ మీడియాని వినియోగించ‌డంలో త‌ల్లిదండ్రులు క‌ఠినంగా ఉండ‌టంతోనే ఇప్పుడు కాస్త అయినా నెగిటివిటీని బ్యాలెన్స్ చేయ‌గ‌ల్గుతున్నానంది. అలా ఉంది అన‌న్యా పాండేపై సోష‌ల్ మీడియా ప్రభావం. ఈ అమ్మ‌డు చంకీ పాండే వార‌సురాలిగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

తండ్రి వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకుని సినిమాల్లోకి రావ‌డంతో ఎంతో గ‌ర్వంగా ఉందంది. ఆ ఇమేజ్ తో అవ‌కాశాలు వ‌చ్చినా? న‌ట‌న‌, ప్రేక్షకుల క‌మ్యునికేష‌న్ తోనే ప‌రిశ్ర‌మ‌లో రాణించ‌గ‌లమంది. రోజులు మారుతోన్న కొద్ది చిత్ర ప‌రిశ్ర‌మ‌లో బంధు ప్రీతీ గురించి చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉంటాయంది. వాటిని ఓ ద‌శ వ‌ర‌కూ ప‌ట్టించుకుని వ‌దిలేసిన‌ట్లు తెలిపింది. అన‌న్యా పాండే టాలీవుడ్ లో `లైగ‌ర్` సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఎన్నో ఆశ‌ల‌తో తెలుగులో ప్ర‌యాణం మొద‌లు పెట్టినా? తొలి సినిమా ప్లాప్ అవ్వ‌డంతో మ‌ళ్లీ టాలీవుడ్ లో క‌నిపించ‌లేదు. అప్ప‌టి నుంచి బాలీవుడ్ కి ప‌రిమిత‌మై అక్క‌డే ప‌ని చేస్తోంది. తాజాగా మ‌ళ్లీ అమ్మ‌డి మ‌న‌సు తెలుగు సినిమాలు కోరుకుంటుందని ఈ మ‌ధ్య క‌థ‌నాలొస్తున్నాయి. కానీ కంబ్యాక్ అన్న‌ది ఇక్క‌డ అంత సుల‌భం కాదు.

Tags:    

Similar News