ఇన్‌సైడ్ టాక్: 'ఛాంపియన్' హైలెట్స్ ఇవే.. ఎలా ఉంటుందంటే?
హీరో రోషన్ ఈ పాత్రలో ఒదిగిపోయాడని టాక్. ఒక ఫుట్ బాల్ ప్లేయర్ బాడీ లాంగ్వేజ్ తో పాటు, ఎమోషనల్ సీన్స్ లో చాలా మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడట.;
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ లో వచ్చే సినిమాలలో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, సీతారామం, జాతిరత్నాలు, మొన్నటి కల్కి వరకు అన్నీ బ్లాక్ బస్టర్లే. ఇప్పుడు అదే నమ్మకంతో రోషన్ మేక హీరోగా 'ఛాంపియన్' చిత్రాన్ని రేపు ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 40 నిమిషాలుగా లాక్ అయ్యింది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఇన్ సైడ్ టాక్ ప్రకారం సినిమాకు పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ అవుతోంది.
ఈ సినిమా కేవలం ఫుట్ బాల్ ఆట చుట్టూ తిరిగే కథ మాత్రమే కాదు. 1948 కాలం నాటి ఒక బరువైన ఎమోషనల్ డ్రామా. తెలంగాణ చరిత్రలో మర్చిపోలేని 'బైరన్ పల్లి ఘటన' ఆధారంగా ఒక భారీ ప్రపంచాన్ని సృష్టించారు. ఒకవైపు ఫుట్ బాల్ ప్లేయర్ కావాలనే ఒక యువకుడి తపన, మరోవైపు తన ఊరి కోసం, ప్రజల కోసం చేసే పోరాటం.. ఈ రెండింటిని చాలా బ్యాలెన్స్డ్ గా నడిపారని తెలుస్తోంది. పీరియాడిక్ కథలకు ఎమోషన్స్ తోడైతే రిజల్ట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
హీరో రోషన్ ఈ పాత్రలో ఒదిగిపోయాడని టాక్. ఒక ఫుట్ బాల్ ప్లేయర్ బాడీ లాంగ్వేజ్ తో పాటు, ఎమోషనల్ సీన్స్ లో చాలా మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడట. ఇండస్ట్రీకి ఒక ఫ్యూచర్ స్టార్ దొరికాడని చూసిన వాళ్లు కితాబిస్తున్నారు. ఇక మలయాళ భామ అనశ్వర రాజన్ కు ఇదే తొలి తెలుగు సినిమా అయినా, తన నటనతో మ్యాజిక్ చేసిందని, ఆమె పాత్ర సినిమాకు పెద్ద అసెట్ అని అంటున్నారు.
టెక్నికల్ గా సినిమాను అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దారట. ముఖ్యంగా ప్రొడక్షన్ డిజైన్ ప్రేక్షకులను 1940 నాటి కాలానికి తీసుకెళ్తుందని అంటున్నారు. ఆనాటి పల్లెటూరి వాతావరణం, బైరన్ పల్లి వీధులను కళ్లకు కట్టినట్లు చూపించారట. దీనికి తోడు మిక్కీ జే మేయర్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయని, విజువల్స్ కి ప్రాణం పోశాయని సమాచారం.
సినిమాలో అన్నింటికంటే హైలైట్ క్లైమాక్స్ అని తెలుస్తోంది. చివర్లో వచ్చే ఒక భారీ ట్విస్ట్ ప్రేక్షకులకు ఊహించని సర్ ప్రైజ్ ఇస్తుందట. ఆ ట్విస్ట్ తో సినిమా ముగింపు చాలా బలంగా, హృదయానికి హత్తుకునేలా ఉంటుందని టాక్. చాలా కాలం తర్వాత స్క్రీన్ మీద ఒక ఫ్రెష్ ఎక్స్ పీరియన్స్ గ్యారెంటీ అని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. బైరన్ పల్లి బ్యాక్ డ్రాప్, ఫుట్ బాల్ ఎలిమెంట్, వైజయంతీ వారి మేకింగ్ తో 'ఛాంపియన్' బాక్సాఫీస్ దగ్గర మరో మైల్ స్టోన్ గా నిలిచేలా ఉందనే టాక్ వస్తోంది. మరి రేపు థియేటర్లలో ఈ ఎమోషనల్ జర్నీ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.