బాహుబలి షేర్ లు కొనాలనుందా?
500 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది బాహుబలి. 600కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతోందింకా. ఇక జక్కన్న ఆలోచనలన్నీ బాహుబలి 2 గురించే. అయితే బాహుబలి కొత్త మార్కెట్లకు ఊపిరిలూదింది. కంటెంట్ తో కొడితే పొరుగు నుంచి కూడా కోట్లు కొల్లగొట్టొచ్చు అని నిరూపించింది. సరిగ్గా ఇదే పాయింటు తో ఇప్పుడు బాహుబలి 2 మార్కెట్ స్ట్రాటజీ మారిపోయింది. ఏకంగా ఈ సినిమాని షేర్ మార్కెట్ తరహాలో అమ్మేయడానికి ప్లాన్ చేశారు.
షేర్ లు కొనండి, పెట్టుబడులు పెట్టండి. లాభాలు పొందండి.. అన్న ప్రాతిపదికగా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. షేర్ మార్కెట్ లో పెట్టుబడుల కంటే బాహుబలి 2లో పెట్టుబడులే సురక్షితం అంటూ ప్రచారం సాగిస్తున్నారు. బాహుబలికి కేవలం టాలీవుడ్ నుంచి మాత్రమే పెట్టుబడులు వెళ్లాయి. కానీ ఇప్పుడు రెండో భాగం తెరకెక్కడానికి దేశ, విదేశాల నుంచి కార్పొరెట్ దిగ్గజాలు రావాల్సిందిగా నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ వెల్ కమ్ చెబుతున్నారు. పీపీపీ పద్థతిలో ఈ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ తో కలిసి పదే పదే ఈ స్క్రిప్టు గురించి మదన పడుతున్నారట.
టాలీవుడ్ లోనే కనీవినీ ఎరుగని కొత్త ఎటెంప్ట్ ఇది. ఇలా ఎక్కువమంది భాగస్వాముల్ని ఆహ్వానించడం కరెక్టేనా? అన్న ప్రశ్న వేస్తే... కార్పొరెట్ నుంచి బోలెడన్ని ఎంక్వయిరీలు వస్తుంటే తప్పదు కదా! అనే సమాధానం వస్తోంది. హీరో కం నిర్మాత అజయ్ దేవగన్ చెప్పినదాని ప్రకారం.. గోల్ మాల్, సింగం, సన్నాఫ్ సర్ధార్ .. వీటికి సీక్వెల్స్ తెరకెక్కించేప్పుడు ఇతరుల నుంచి పెట్టుబడులు ఆహ్వానించాను. 100 కోట్ల నుంచి 300 కోట్లు దాటి వసూళ్లు తెచ్చేప్పుడు ఇలా పెట్టుబడులు రప్పిస్తే తప్పేం లేదు. బాహుబలి రేంజు సినిమాకి అవసరమేనని అంటున్నాడు.
క్రిష్ 3 విషయంలో తాము కూడా ఇలేనే చేశామని హృతిక్ రోషన్ అన్నారు. హాలీవుడ్ రేంజులో ఎంక్వయిరీలు వచ్చినప్పుడు అంతర్జాతీయ స్టూడియోల నుంచి పెట్టుబడులు సమీకరించామని తెలిపారు. ఇలా చేయడం ఫీజబుల్ అంటూ కన్ క్లూజన్ ఇచ్చారు. అదీ సంగతి.