ఉండేది తక్కువ సమయం.. అందుకే అన్ని చేస్తా
టాలీవుడ్ లో ఈ మద్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు నివేదా పేతురాజ్. ఒక వైపు స్టార్ హీరోల సినిమాలో నటిస్తూ మరో వైపు చిన్న హీరోల సినిమాల్లో కూడా కనిపిస్తుంది. ఒక వైపు హీరోయిన్ గా చేస్తూనే మరో వైపు సెకండ్ హీరోయిన్ పాత్రలు ప్రత్యేక పాత్రలు గెస్ట్ రోల్స్ వస్తే వదిలి పెట్టడం లేదు. వచ్చే ప్రతి ఆఫర్ ను సద్వినియోగం చేసుకుని కెరీర్ లో ముందుకు దూసుకు వెళ్లడంతో పాటు తెలుగు ఇండస్ట్రీ మరియు మీడియా వర్గాల వారితో ట్యాలెంటెడ్ హీరోయిన్ అంటూ పేరు దక్కించుకుంది.
టాలీవుడ్ లో ఈ అమ్మడు చేస్తున్న సినిమాల జాబితా చాలా పెద్దగా ఉంది. తాజాగా ఈమె 'రెడ్' సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించింది. ఆ సినిమా విడుదలకు రెడీ అవుతున్న నేపథ్యంలో నివేదా పేతురాజ్ మీడియాతో మాట్లాడింది. ఆ సందర్బంగా పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించింది. నివేదా మాట్లాడుతూ.. ఇంతకు ముందు నేను పోలీస్ ఆఫీసర్ గా తమిళంలో ఒక సినిమాను చేశాను. కనుక రెడ్ సినిమాలో పోలీస్ గా నటిస్తున్న సమయంలో ఇబ్బందిగా ఏమీ అనిపించలేదు. పైకి గంభీర్యంగా కనిపించినా లో లోపల భయపడే పాత్రలో నేను కనిపించాను. యాక్షన్ సీన్స్ ఏమీ ఉండవు. కాని విరాటపర్వం సినిమాలో చిన్న రోల్ చేశాను. ఆ సినిమాలో పీటర్ హెయిన్స్ తో యాక్షన్ సీన్ ఉండబోతుంది.
రెడ్ సినిమా షూటింగ్ సందర్బంగా రామ్ తో మంచి పరిచయం ఏర్పడింది. ఇద్దరం కూడా హాయిగా తమిళంలో మాట్లాడుకునే వాళ్లం. రామ్ మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న హీరో. ఇద్దరం చాలా సరదాగా ఉండేవాళ్లం అంది. ఇక సెకండ్ హీరోయిన్ గా నటించేందుకు ఒప్పుకోవడానికి కారణం ఏంటీ అంటూ ప్రశ్నించిన సమయంలో నాకు పాత్ర నచ్చితే తప్పకుండా నటించేందుకు సిద్దంగా ఉంటాను. అల వైకుంఠపురంలో సినిమాలో పాత్ర బలంగా ఉండటంతో పాటు త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చిందనే ఉద్దేశ్యంతో సెకండ్ హీరోయిన్ గా నటించేందుకు ఓకే చెప్పాను. ఇంకా కొన్ని సినిమాల్లో కూడా సెకండ్ లీడ్ గా నటించాను. హీరోయిన్ కెరీర్ టైం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు మూడు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం బిజీ ఉండే అవకాశం లేదు. కనుక అంది వచ్చిన ఆఫర్లు అన్నింటిని చేసి నటిగా నిరూపించుకోవాలని భావిస్తున్నాను అంటూ ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.