పిక్ టాక్: క్రిస్మస్ నాడు క్రేజీ కపుల్ రొమాంటిక్ ఫోజ్..!
కోలీవుడ్ క్రేజీ కపుల్స్ లో స్టార్ హీరోయిన్ నయన తార - డైరెక్టర్ విఘ్నేష్ శివన్ జంట ఒకటి. ఈ సినీ లవ్ బర్డ్స్ గత ఐదేళ్లుగా డేటింగ్ చేస్తూ వార్తల్లో ఉంటున్నా పెళ్లి విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఇద్దరూ కుదిరినప్పుడల్లా చెట్టాపట్టాలేసుకుని ప్రపంచ దేశాలన్నీ తిరిగి వస్తుంటారు. ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఆ మధ్య ఓనమ్ పండుగను సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలు.. విఘ్నేష్ శివన్ పుట్టిన రోజు సందర్భంగా గోవా లో తీసుకున్న రొమాంటిక్ ఫోటోలు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో తెలిసిందే. దొరికిన ప్రతి సందర్భాన్ని ఎంజాయ్ చేస్తూ తమ మధ్య ప్రేమని ఓపెన్ గా వ్యక్తపరుస్తూ వస్తున్న ఈ దర్శకనాయికా ద్వయం క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో భాగంగా మరో రొమాంటిక్ ఫోటోని షేర్ చేశారు.
తాజాగా నయనతార సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఫొటోలో ఓపెన్ ప్లేస్ లో ఉన్న సోఫాపై విగ్నేష్ శివన్ - నయన్ జంట కూర్చుని ఉన్నారు. విఘ్నేష్ తన ప్రియసఖి నయన్ చేయి పట్టుకుని లవ్ ప్రపోజ్ చేస్తున్నట్లు కనిపిస్తుండగా.. అమ్మడు అతని వైపు కొంటెగా చూస్తూ తన వేలును చూపిస్తూ ఉంది. ఈ అమేజింగ్ ఫొటోలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీని చూడొచ్చు. ట్రెండీ ఔట్ ఫిట్స్ లో ఉన్న నయనతార ఫోజ్ నెటిజన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైర ల్‌గా మారాయి. ఇప్పటికి రెండు సార్లు ప్రేమలో విఫలమైన నయన్.. ముచ్చటగా మూడోసారి సాగిస్తున్న ప్రేమాయణాన్ని పెళ్లి వరకు తీసుకురావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార 'కాదువాక్కుల రెండు కాదల్' అనే చిత్రంలో నటిస్తోంది.