లింగ వివ‌క్ష‌పై అమితాబ్ మ‌న‌వ‌రాలు కామెంట్

Update: 2022-02-26 02:30 GMT
ఇంట్లో పాతుకుపోయిన లింగవివక్షపై అమితాబ్ మ‌న‌వ‌రాలు నవ్య నంద చేసిన కామెంట్ హాట్ టాపిక్ గా మారింది.  మా ఇంటికి అతిథి వచ్చినప్పుడు అత‌డు వెళ్లే వ‌ర‌కూ నేను హోస్ట్ గా మారాలి.. అని వ్యాఖ్యానించింది. నిజానికి త‌న సోద‌రుడిక ఆ స‌మ‌యంలో  ఎలాంటి ప‌నుల చెప్ప‌ర‌ని త‌న‌ని మాత్రం ప‌దే ప‌దే అడుగుతార‌ని వెల్ల‌డించింది.

అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందాకు బాలీవుడ్ లోకి ప్రవేశించాలనే సంకల్పం లేకపోవచ్చు కానీ ఆమె పాపులారిటీ ఏ ఇత‌ర హీరోయిన్ కీ తక్కువేమీ కాదు. త‌న‌కు సోషల్ మీడియాలో భారీ  ఫాలోయింగ్ ఉంది. త‌న‌ది ఏదైనా ఫోటో వైరల్ కావడానికి ఎక్కువ సమయం పట్టదు.

ఆమె యాక్టివ్ సోషల్ మీడియా యూజర్ కూడా.. అభిమానులను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయడానికి ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తుంది. అదంతా స‌రే కానీ.. ఇటీవల యువ పారిశ్రామికవేత్త న‌వ్య నందా ఇంటర్నెట్ లో ట్రెండింగ్‌లో ఉన్న SheThePeopleకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమె ఇంట్లో పాతుకుపోయిన సెక్సిజం గురించి మాట్లాడింది.

ఒక ఇంటర్వ్యూలో నవ్య నవేలీ మాట్లాడుతూ.. ఇంట్లో అతిథులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి .. అలాంట‌ప్పుడు నేను హోస్ట్ గా ఆడాల్సి వ‌స్తోంది... నా సోదరుడు కాదు`` అని కోప‌గించుకుంది. అతిథులు వెళ్లిపోయే వ‌ర‌కూ మా అమ్మ ఎప్పుడూ ఏదో ఒకటి తీసుకురావాలని నన్ను అడుగుతుంది అని అంది.

ఈ సందర్భంగా నవ్య మాట్లాడుతూ.. ఉమ్మడి కుటుంబాల్లో ఇంటిని ఎలా నడిపించాలో అతిథులను ఎలా చూసుకోవాలో.. హోస్ట్ గా ఆడాలో నేర్చుకునే బాధ్యత ఎప్పుడూ కూతురిపైనే ఉంటుందని పేర్కొంది.

అదే బాధ్యత తన సోదరుడికి ఎప్పుడూ ఇవ్వలేదని ఆమె పేర్కొంది. నవ్య నవేలి నంద శ్వేతా బచ్చన్ - వ్యాపారవేత్త నిఖిల్ నందా కుమార్తె.  ఒక తమ్ముడు అగస్త్య నంద త‌న‌కు ఉన్నారు. నవ్య యువ‌పారిశ్రామిక వేత్త‌గా పాపుల‌ర‌య్యారు. ఆరా హెల్త్ అనే వర్చువల్ హెల్త్ కేర్ ప్లాట్ ఫామ్ ను త‌ను నడుపుతోంది.

ఇది రహస్యంగా సురక్షితమైన  నమ్మదగిన పద్ధతిలో మహిళలకు సాధికారత.. అవగాహన కల్పించడం.. రోగ నిర్ధారణ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీకి మ‌రో ముగ్గురు సహ వ్యవస్థాపకులు కూడా ఉన్నారు. అహల్య మెహతా- మల్లికా సాహ్నీ - ప్రగ్యా సబూ .. ఈ ముగ్గురు స‌భ్యుల‌తో కూడిన కంపెనీ ఇది.
Tags:    

Similar News