ఆన్‌ లైన్‌ లోనే కథలు వినేస్తున్నాడట!

Update: 2020-05-05 07:04 GMT
కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్‌ ఎక్కడికి అక్కడ ఆగిపోయాయి. లాక్‌ డౌన్‌ లో కొన్నింటికి సడలింపులు ఇచ్చినా కూడా షూటింగ్స్‌ మళ్లీ ప్రారంభం అయ్యేందుకు సమయం పడుతుందని అంటున్నారు. ఈ సమయంలో దర్శకులు.. రచయితలు కొత్త కథలు రాసుకోవడంతో పాటు కొందరు ప్రస్తుతం చేస్తున్న సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చేస్తున్నారు. ఇక హీరోలు ఆన్‌ లైన్‌ ద్వారా.. ఫోన్‌ ద్వారా కథలు వింటూ ఉన్నారు. యంగ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టి ప్రస్తుతం ఫోన్‌ ద్వారా కథలు వింటున్నాడట.

ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో నటుడిగా మంచి పేరు దక్కించుకోవడం తో పాటు సినిమాకు కూడా మంచి పేరు వచ్చింది. ఆ సినిమా తర్వాత ఈయనకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం జాతి రత్నాలు అనే చిత్రాన్ని చేస్తున్న నవీన్‌ పొలిశెట్టి తదుపరి చిత్రాన్ని ఈ సమ్మర్‌ లో ప్రారంభించాలనుకున్నాడు. కరోనా కారణంగా జాతిరత్నాలు షూటింగ్‌ ఆగిపోవడంతో తదుపరి చిత్రం కథ విషయంలో ఒక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయ్యాడు.

లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన వెంటనే జాతిరత్నాలు చిత్రాన్ని పూర్తి చేసి ఆ వెంటనే కొత్త సినిమాను ప్రారంభించేందుకు వీలుగా నవీన్‌ ఫోన్‌ లోనే స్క్రిప్ట్‌ ను దాదాపుగా ఓకే చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పలువురు కథలు వినిపించగా అందులో కొన్నింటిపై దృష్టి పెట్టిన నవీన్‌ త్వరలోనే ఒక కథను ఫిక్స్‌ అవ్వనున్నాడట.

నవీన్‌ తదుపరి చిత్రం ఇదే ఏడాదిలో ప్రారంభం అవ్వనుంది. జాతిరత్నాలు కూడా ఇదే ఏడాదిలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. థియేటర్లు ఓపెన్‌ అయ్యి పరిస్థితులు యధా స్థితికి వచ్చిన వెంటనే నవీన్‌ జాతిరత్నాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
Tags:    

Similar News