అడివి శేష్ 'డెకాయిట్'.. లవ్ మెలోడీ లోడింగ్..

టాలీవుడ్‌ లో కంటెంట్ బేస్డ్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అడివి శేష్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.;

Update: 2026-02-23 13:21 GMT

టాలీవుడ్‌ లో కంటెంట్ బేస్డ్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అడివి శేష్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. థ్రిల్లర్ స్టోరీలతో వరుస విజయాలు అందుకున్న శేష్.. ప్రస్తుతం తెలుగు- హిందీ పాన్ ఇండియా బైలింగ్వెల్ మూవీ డెకాయిట్ లో నటిస్తున్నారు. ఆ సినిమాలో ఆయనకు జోడీగా బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు- నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు.



 


షూటింగ్ అప్డేట్స్, టీజర్‌ తో ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్న ఆ చిత్రానికి సంబంధించిన మరో అప్డేట్ తాజాగా వచ్చింది. సినిమాలోని తొలి పాట 'రుబారూ..'ను ఫిబ్రవరి 27వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది ఒక హృదయాన్ని తాకే సోల్‌ ఫుల్ మెలోడీగా ఉండబోతుందని తెలిపారు. డెకాయిట్‌ గా మారే ముందు హీరో హృదయం ప్రేమలో ఎలా పడిందో.. రుబారూ పాటలో చూపించనున్నారని సమాచారం.

అయితే సాంగ్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ సమయంలో మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందరినీ ఆకట్టుకుంటోంది. వైట్ కలర్ డ్రెస్ లో మృణాల్ ఠాకూర్ అందంగా కనిపిస్తుండగా, అడివి శేష్ మాత్రం ఇప్పటివరకు కనిపించని కొత్త లుక్‌ లో కనిపిస్తున్నారు. అయితే ఫస్ట్ సింగిల్ సినిమాలోని లవ్ ట్రాక్‌ క్లియర్ గా చెప్పనున్నట్లు అర్థమవుతోంది.

ఇక డెకాయిట్ విషయానికొస్తే.. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌ పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. దర్శకుడిగా షానియల్ డియో వ్యవహరిస్తున్నారు. సమ్మర్ సీజన్‌ లో గ్రాండ్‌ గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సంగీతం విషయానికి వస్తే, మ్యూజిక్ లవర్స్‌ కు మరో ట్రీట్ రెడీ అవుతోంది. ఎందుకంటే సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.

ఆయన కంపోజ్ చేసిన అనేక మెలోడీలు ఇప్పటికే మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు రుబారూ కూడా చార్ట్‌ బస్టర్ అవుతుందని అంతా అంచనా వేస్తున్నారు. అదే సమయంలో మూవీ కథ విషయానికి వస్తే, ఇద్దరు మాజీ ప్రేమికుల మధ్య జరిగిన సంఘటనల నేపథ్యంలో యాక్షన్- ఎమోషన్స్ మిక్సింగ్ తో సినిమా రూపొందిస్తున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్‌ కు మంచి స్పందన వచ్చింది.

ముఖ్యంగా బ్యాక్‌ గ్రౌండ్‌ లో కింగ్ నాగార్జున నటించిన క్లాసిక్ సాంగ్ ట్యూన్ వినిపించడం అభిమానులను ఆకట్టుకుంది. ఖైదీ లుక్‌ లో శేష్ కనిపించడం, కార్ చేజ్ యాక్షన్ సీక్వెన్స్లు, 'నేను ఓ దొంగని' అంటూ చెప్పే డైలాగ్ ఆసక్తి మరింత పెంచాయి. ఏదేమైనా లవ్, యాక్షన్, థ్రిల్ ఎలిమెంట్స్ తో డెకాయిట్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు అందరి చూపు రుబారూ పాటపై పడింది. మరి ఫస్ట్ సింగిల్ ఎంతలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News