కెరీర్‌ లో ప్యారడైజ్ కోసం ఫస్ట్ టైమ్- జడల్​ రోల్ లో ఒక రకమైన పిచ్చి!: నాని

నేచురల్ స్టార్ నాని అంటే ఫ్యామిలీ హీరో అని అంతా చెబుతుంటారు. కానీ ఇప్పుడు ఆయన ఎంచుకున్న ది ప్యారడైజ్ మాత్రం ఇప్పటివరకు చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండబోతోందని నాని చెబుతున్నారు.

Update: 2026-09-20 11:45 GMT

నేచురల్ స్టార్ నాని అంటే ఫ్యామిలీ హీరో అని అంతా చెబుతుంటారు. కానీ ఇప్పుడు ఆయన ఎంచుకున్న ది ప్యారడైజ్ మాత్రం ఇప్పటివరకు చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండబోతోందని నాని చెబుతున్నారు. ముఖ్యంగా జడల్ రోల్, భారీ యాక్షన్, అనిరుధ్ బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్, తల్లీకొడుకుల ఎమోషన్.. ఇలా నాని ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

ప్యారడైజ్ తన రోల్ కు చేసిన వాటికి చాలా భిన్నంగా ఉంటుందని నాని తెలిపారు. జడలు పెట్టుకోవడం కేవలం కొత్త లుక్ కోసం చేసిన ప్రయోగం కాదని, కథ నుంచే ఆ లుక్ వచ్చిందని చెప్పారు. ఇప్పటివరకు తన రోల్స్ ఆడియనస్ కు తెలిసిన వ్యక్తుల్లా, ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఉండేవని.. కానీ జడల్ పాత్ర అలా ఉండదన్నారు. ఆ పాత్రలో మొదటి నుంచే ఒక రకమైన పిచ్చితనం ఉంటుందని, ప్రేక్షకులు అతడిని చూసినప్పుడు మనకు తెలిసిన వ్యక్తే అనే ఫీలింగ్ రాదని వివరించారు. ఇలాంటి రోల్ తనకు ఇదే తొలిసారి అని చెప్పారు.

అయితే సినిమా యూత్ కోసం మాత్రమే కాదని నాని క్లారిటీ ఇచ్చారు. సినిమాలో తల్లీకొడుకుల మధ్య స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుందన్న నాని.. లవ్, ఫ్యామిలీ రిలేషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయని తెలిపారు. వైలెన్స్ ఎక్కువగా ఉండటంతో చిన్న పిల్లలను తీసుకెళ్లడం విషయంలో జాగ్రత్త అవసరమని అన్నారు. ఇక అనిరుధ్ బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ గురించి నాని ప్రత్యేకంగా మాట్లాడారు.

తన సినిమాలన్నింటిలో చూసుకుంటే ది ప్యారడైజ్ కు అనిరుధ్ ఇచ్చిన అవుట్ పుట్ బెస్ట్ గా అనిపించిందన్నారు. సినిమా మొదటి నుంచి చివరి వరకు స్కోర్‌ తో థియేటర్‌ ను పట్టి ఉంచే ఛాన్స్ ప్యారడైజ్ తో వచ్చిందని చెప్పారు. తెలంగాణ జానపద శైలి, ఫోక్ వాయిస్‌లపై దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు ఉన్న పట్టుతో అనిరుధ్ మ్యూజిక్ కలవడం వల్ల పాటలు ప్రత్యేకంగా నిలిచాయని నాని తెలిపారు.

మోహన్‌ బాబు రోల్ కోసం నాని ఆసక్తికర విషయం చెప్పారు. కథ చెప్పిన మొదటి రోజే శ్రీకాంత్ ఓదెల ఆ పాత్రకు మోహన్‌ బాబు అయితే బాగుంటుందని చెప్పారట. పాత్ర చాలా నెగిటివ్ గా, వైలెంట్ గా ఉంటుందని ఆయన ఓకే చెప్తారా లేదా అనే డౌట్ తనకు ఉండేదని నాని చెప్పారు. కానీ కథ విన్న వెంటనే మోహన్‌బాబు చాలా జోష్ తో రెస్పాండ్ అయ్యారని అన్నారు. ప్యారడైజ్ లో కెరీర్‌ లోనే ఎప్పుడూ చేయనంత యాక్షన్ చేశానని నాని చెప్పారు.

అయితే ప్రతి ఫైట్‌ కు ఒక ఎమోషనల్ రీజన్ ఉంటుందని, కేవలం హీరోను ఎలివేట్ చేయడానికి ఫైట్లు ఉండవని అన్నారు. అలాగే శ్రీకాంత్ తనను డ్యాన్స్ చేయగల హీరోగా నమ్మడంతో పాటల్లోనూ కొత్తగా ప్రయత్నించానని చెప్పారు. సినిమా స్టోరీ 1984- 85 ప్రాంతంలో జరుగుతుందని నాని తెలిపారు. చివరగా శ్రీకాంత్ ఓదెల గురించి మాట్లాడుతూ.. ఆయనలో మాస్ సినిమాలపై స్పెషల్ టేస్ట్ ఉందని నాని చెప్పారు. థియేటర్‌ లో ప్రేక్షకుల రెస్పాన్స్ దృష్టిలో పెట్టుకునే ప్రతి సీన్ డిజైన్ చేస్తారని, ప్యారడైజ్ లోని కొన్ని సన్నివేశాలు తనకే చాలా ఇష్టమని, ప్రేక్షకులు కూడా వాటిని చూసి ఆశ్చర్యపోతారంటూ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News