యష్ నెట్ వర్త్ ఎంతుంటుంది?
పాన్ ఇండియా రేంజ్ లో ఆయనకు గుర్తింపు తెచ్చిన సినిమా కేజీఎఫ్. ఆ మూవీ ఘనవిజయం తర్వాత యష్ మార్కెట్ ఫుల్ గా పెరిగింది.;
కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి పాన్ ఇండియా స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో యష్. రాకీ భాయ్ గా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఆయన ఇప్పుడు కేవలం హీరోగానే కాదు, కోట్ల ఆస్తులతో సక్సెస్ ఫుల్ సెలబ్రిటీగా కూడా నిలిచారు. ఒకప్పుడు రోజుకు రూ.50 కోసం పని చేసిన యష్.. ఇప్పుడు కోట్లలో సంపాదిస్తున్నారు అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
పాన్ ఇండియా రేంజ్ లో ఆయనకు గుర్తింపు తెచ్చిన సినిమా కేజీఎఫ్. ఆ మూవీ ఘనవిజయం తర్వాత యష్ మార్కెట్ ఫుల్ గా పెరిగింది. దేశవ్యాప్తంగా అభిమానులు పెరిగారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే యష్ జర్నీ మాత్రం చాలా సాధారణంగా మొదలైంది.
నవీన్ కుమార్ అలియాస్ యష్ కు చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి. 16 ఏళ్ల వయసులో ఇంటిని విడిచి ఇండస్ట్రీకి వచ్చారు. మొదట బ్యాక్ స్టేజ్ అసిస్టెంట్ గా పనిచేశారు. ఆ సమయంలో రోజుకు కేవలం రూ.50 మాత్రమే రెమ్యూనరేషన్. టీవీ సీరియల్స్ నుంచి కెరీర్ ప్రారంభించి, చిన్న చిన్న పాత్రలతో అవకాశాలు అందుకున్నారు. ఆ తర్వాత మెల్లగా హీరోగా ఎదిగి కన్నడలో స్టార్ గా మారారు.
ప్రస్తుతం యష్ నికర ఆస్తి విలువ సుమారు రూ.60 కోట్లకు పైగా ఉంటుందని సినీ వర్గాల అంచనా. ఒక్కో సినిమాకు దాదాపు రూ.20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ద్వారా కూడా మంచి ఆదాయం పొందుతున్నారు. పెప్సీ, కోకా కోలా, మింత్ర, కళ్యాణ్ జ్యువెలర్స్ వంటి ప్రముఖ కంపెనీలకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.
ఒక్కో యాడ్ కు సుమారు రూ.60 లక్షల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, విలన్ పేరిట తన సొంత పెర్‌ఫ్యూమ్ బ్రాండ్ ను కూడా నడుపుతున్నారు. అయితే పర్సనల్ లైఫ్ లో కూడా యష్ లైఫ్ స్టైల్ చాలా లగ్జరీగా ఉంటుంది. బెంగళూరులో నాలుగు కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన డ్యూప్లెక్స్ హౌస్ లో కుటుంబంతో నివసిస్తున్నారు.
అంతే కాదు గ్యారేజీలో ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. రేంజ్ రోవర్, మెర్సిడెస్ వంటి బ్రాండ్లు ఆయన కలెక్షన్ లో ఉన్నాయి. సంపాదనతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా యష్ ముందుంటారు. విలేజెస్ డెవలప్మెంట్, వాటర్ సప్లై, పేదలకు సహాయం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన భార్యతో కలిసి యశో మార్గో ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవ చేస్తున్నారు. ఏదేమైనా సాధారణ స్థాయి నుంచి కోట్ల ఆస్తుల వరకు ఎదిగిన యష్ జర్నీ చాలా మందికి ఇన్స్పిరేషన్.