నాచురల్‌ స్టార్‌ పాన్‌ ఇండియా క్రేజ్‌ కష్టాలు

Update: 2020-05-08 09:10 GMT
టాలీవుడ్‌ హీరోలు పలువురు ప్రస్తుతం పాన్‌ ఇండియా సినిమాలంటున్నారు. తమిళం, కన్నడం, మలయాళంతో పాటు హిందీలో కూడా తమ సినిమాలు విడుదల చేయాలని అందరు ప్రేక్షకులను అలరించి పాన్‌ ఇండియా హీరో అవ్వాలనే కలలు కంటున్నారు. యంగ్‌ హీరోల నుండి సీనియర్‌ హీరోల వరకు ఇదే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రస్తుతం నాని కూడా పాన్‌ ఇండియా గుర్తింపు కోసం కష్టాలు పడుతున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది.

నాని ‘వి’ చిత్రంను పూర్తి చేశాడు. మరో వైపు టక్‌ జగదీష్‌ చిత్రం లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన వెంటనే షూటింగ్‌ పున: ప్రారంభించి దాన్ని కూడా త్వరలోనే పూర్తి చేసి విడుదలకు సిద్దం చేయనున్నాడు. ఇక నాని కమిట్‌ అయిన మరో సినిమా శ్యామ్‌ సింగరాయ్‌. ట్యాక్సీవాల చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్న రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో నాని ఈ సినిమాను చేయబోతున్నాడు. పీరియాడిక్‌ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కబోతుందట.

భారీ బడ్జెట్‌ తో మైత్రి మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు రెడీ అయ్యారు. సినిమా సబ్జెక్ట్‌ యూనివర్శిల్‌ సబ్జెక్ట్‌ అవ్వడంతో పాటు భారీ బడ్జెట్‌ సినిమా అవ్వడం వల్ల పాన్‌ ఇండియా లెవల్‌ లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. అందుకే నాని కూడా ఇతర సినిమాల కంటే ఈ సినిమాకు మరింత కష్టపడుతున్నాడట. ఈ చిత్రం కోసం నాని ఏకంగా సిక్స్‌ ప్యాక్‌ ను ట్రై చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

టక్‌ జగదీష్‌ చిత్రం విడుదలకు ముందే ఈ చిత్రంను ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కనుక నాని ఇప్పటి నుండే సిక్స్‌ ప్యాక్‌ కోసం కసరత్తులు మొదలు పెట్టాడట. నాని చేయబోతున్న ఈ మొదటి పాన్‌ ఇండియా మూవీ ఎలా ఉండబోతుందో చూడాలంటే కొన్నాళ్లు వెయిట్‌ చేయాల్సిందే.
Tags:    

Similar News