సామ్.. మళ్లీ క్లారిటీ ఇస్తారా?

సెలబ్రిటీలు తమ పర్సనల్ లైఫ్ గురించి చేసే కామెంట్స్.. ఎంతటి చర్చకు దారితీస్తాయో మరోసారి క్లారిటీ వచ్చింది.;

Update: 2026-02-24 05:59 GMT

సెలబ్రిటీలు తమ పర్సనల్ లైఫ్ గురించి చేసే కామెంట్స్.. ఎంతటి చర్చకు దారితీస్తాయో మరోసారి క్లారిటీ వచ్చింది. రీసెంట్ గా స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు.. ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతే కాదు.. పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు కూడా దారితీశాయి. దీంతో సామ్ వ్యాఖ్యలపై అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. అసలేం జరిగిందంటే?

ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్‌ కు రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత తన రెండో వివాహం, ప్రేమ గురించి ఓపెన్‌ గా మాట్లాడారు. "మళ్లీ లవ్ లో పడతానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ జీవితం నాకు మరో అవకాశం ఇచ్చింది" అంటూ ఆమె ఎమోషనల్ గా మాట్లాడారు. దర్శకుడు రాజ్ నిడిమోరు ద్వారా తనకు ప్రేమ, ఆప్యాయత దొరికాయని.. ఆయనతో ఉన్న బంధం తనను మానసికంగా మరింత స్ట్రాంగ్ గా మార్చిందని తెలిపారు.

గతంలో ఎదురైన కష్టకాలం తర్వాత ఆయనతో రిలేషన్‌ షిప్ తనకు కొత్త ఆశను ఇచ్చిందని, మొత్తం మారిపోయానని తెలిపారు. అయితే సమంత చేసిన ఆ కామెంట్స్ వ్యాఖ్యలు అందరికీ నచ్చలేదు. ముఖ్యంగా కొంతమంది సినీ ప్రియులు, సోషల్ మీడియా యూజర్లు ఆమె కామెంట్స్ పై విమర్శిస్తున్నారు. గతంలో కూడా ఓ సారి ఆ విషయంపై మాట్లాడినప్పుడు పరోక్షంగా విమర్శలు చేశారని గుర్తు చేస్తున్నారు.

ఇప్పుడు కూడా అదే విధంగా మరో వ్యక్తిని నెగెటివ్‌ గా చూపించేలా మాట్లాడుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. తన ఆనందం గురించి చెప్పుకోవడం ఎలాంటి తప్పు లేదని, కానీ మరో వ్యక్తిని తప్పుపట్టేలా మాట్లాడటం ఎందుకు అని క్వశ్చన్ చేస్తున్నారు. అదే సమయంలో రాజ్ నిడిమోరు గత కుటుంబ పరిస్థితులు ప్రస్తావిస్తూ, ఇలాంటి వ్యాఖ్యలు ఇతరులకు ఎలా అనిపిస్తాయో కూడా ఆలోచించాలంటూ సూచిస్తున్నారు.

అదే సమయంలో మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో రెండో అవకాశం ఉంటుందని, ఆమె సంతోషంగా ఉండటం ముఖ్యమనేనని చెబుతున్నారు. ఆమె తన సంతోషాన్ని వ్యక్తపరిచారని, ఎవరినీ ఏం అనలేదని అంటున్నారు. ఇంకొందరు మాత్రం.. సెలబ్రిటీలు పబ్లిక్‌గా మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే.. సమంత ప్రస్తుతం తన కెరీర్‌ పై ఫుల్ ఫోకస్ పెట్టారు. సినిమాలు, వెబ్ సిరీస్‌ లు, కమర్షియల్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయా షూటింగ్స్ లో పాల్గొంటూ ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పర్సనల్ లైఫ్ పై చేసిన కామెంట్స్ కు వస్తున్న విమర్శలపై రెస్పాండ్ అవ్వలేదు. మరి ఆమె స్పందిస్తారా? లేక సైలెంట్ గా ఉంటారా? అన్నది వేచి చూడాలి.




Tags:    

Similar News