సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న స్టార్‌ వైఫ్‌

Update: 2020-06-30 08:15 GMT
ఈ మద్య కాలంలో స్టార్స్‌ తో పాటు వారి భార్యలు కూడా సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. తమ భర్తలకు సంబంధించిన ఫొటోలు చేయడం వల్ల వారు కూడా నెట్టింట ట్రెండ్‌ అవుతూ ఉన్నారు. తెలుగు స్టార్‌ హీరోల భార్యలు పలువురు ఇన్‌ స్టాగ్రామ్‌ లో లక్షల కొద్ది మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. తమకు సొంత ఇమేజ్‌ దక్కడంతో పాటు ఆదాయం కూడా వస్తున్న నేపథ్యంలో పలువురు స్టార్స్‌ వైప్‌ ఇన్‌ స్టాగ్రామ్‌ లో యాక్టివ్‌ గా ఉంటున్నారు. నాని భార్య అంజనా కూడా ఇన్‌ స్టా లో చాలా యాక్టివ్‌ గా ఉంటారు.

నాని ఇంకా తన కొడుకు ఫొటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. ఇప్పటికే భారీగా ఫాలోవర్స్‌ ను సొంతం చేసుకున్న అంజనా మరింత మంది దృష్టి ని ఆకర్షించడమే లక్ష్యంగా ఒక పాటను ఆకట్టుకుంది. ప్రేమికుడు సినిమాలోని సూపర్‌ హిట్‌ సాంగ్‌ అందమైన ప్రేమరాణి.. పాటను ఆలపించింది. స్నేహితులతో కలిసి ఆమె పాడిన పాట నెట్టింట వైరల్‌ అయ్యింది. సోషల్‌ మీడియాలో అంజనా ట్రెండ్‌ అవ్వడం ఇదే ప్రథమం.

సూపర్‌ హిట్‌ సాంగ్‌ ను పాడేందుకు ముందుకు రావడం చాలా గొప్ప విషయం. ఆ పాట చాలా నోటెడ్‌ కనుక ఏమాత్రం తప్పుగా పాడిన ప్రేక్షకులు ట్రోల్స్‌ చేస్తారు. అలాంటిది సోషల్‌ మీడియాలో అంజనా పాడిన ఆ పాట ట్రెండ్‌ అవుతుంది అంటే ఆమె ఎంత బాగా ఆ పాట పాడినదో అర్థం చేసుకోవచ్చు.
Tags:    

Similar News