• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అల్లు-నంద‌మూరి బంధం.....

అల్లు-నంద‌మూరి బంధం.. ప్రీవిందులో బాల‌య్య‌ సంద‌డే సంద‌డి

| అంతకుముందు నటసింహం బాలయ్య వేడుకకు రాగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వయంగా వెళ్లి ఆయనకు ఘనస్వాగతం పలికారు.

By - Sivaji Kontham
Update: 2026-03-02 19:16 GMT

అల్లు ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. అల్లు శిరీష్‌- నైనికల వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హైద‌రాబాద్ లో జరిగిన ఈ జంట ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకలో టాలీవుడ్ అగ్ర‌ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేడుకకు విచ్చేసిన బాలయ్య నూతన వధూవరులను నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనసారా ఆశీర్వదించారు.

ఈ వేడుకలో బాలయ్య తనదైన శైలిలో సందడి చేస్తూ అందరినీ ఉత్సాహపరిచారు. వేడుక‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అల్లు అరవింద్‌లతో కలిసి ఆయన చాలా సేపు ముచ్చటించారు. సరదాగా నవ్వుతూ, జోకులు వేస్తూ బాలకృష్ణ చేసిన హడావుడి అక్కడి అతిథులను కట్టిపడేసింది. అల్లు- నందమూరి మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ దృశ్యాలు మరోసారి చాటిచెప్పాయి.

అంతకుముందు నటసింహం బాలయ్య వేడుకకు రాగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వయంగా వెళ్లి ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఎన్బీకేను సాదరంగా ఆహ్వానించి ఆయనతో కలిసి ఫొటోలు దిగారు. బాబాయ్ అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ బాలయ్య వెంటే ఉండి అల్లు అర్జున్ మర్యాదలు చేయడం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ దిగ్గజ హీరోలతో పాటు ప్రముఖ దర్శకులు, నిర్మాతలు ఈ వేడుకలో మెరిశారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సీనియర్ నిర్మాతలు అశ్వనీదత్, డివివి దానయ్య, కేఎస్ రామారావు వంటి ప్రముఖులు హాజరై వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వదించారు. సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజాలందరూ ఒకే చోట చేరడంతో అల్లు శిరీష్ రిసెప్షన్ వేదిక కళకళలాడిపోయింది.

పెళ్లి వేడుకల్లో భాగంగా నిన్న జరిగిన వరుడుని చేసే కార్యక్రమంలో కూడా సెలబ్రిటీల సందడి తారాస్థాయిలో ఉంది. ఈ వేడుకకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి హాజరయ్యారు. అలాగే క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న కూడా జంటగా కనిపించి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. మొత్తానికి అల్లు వారి పెళ్లి సంబరాలు ఇప్పుడు పీక్స్ కు చేరుకున్నాయని చెప్పవచ్చు.

ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రధాన ఘట్టానికి సమయం ఆసన్నమైంది. మార్చి 6వ తేదీన అల్లు శిరీష్ - నైనికల వివాహం అత్యంత వైభవంగా జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి ఆ శుభ ముహూర్తాన ఈ జంట ఒక్కటయ్యే అద్భుత దృశ్యాన్ని చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.




అల్లు శిరీష్ – నైనిక ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన బాలకృష్ణ

Follow 👉 @tupaki_official#Balakrishna #AlluSirish #AlluSirishNayanika #LatestNews #Tupaki pic.twitter.com/RCXKJEhoQ9

— Tupaki (@tupaki_official) March 2, 2026


Tags:    
  • allusirish 
  • nainika 
  • preweddingreception 
  • balakrishna 
  • alluarjun 
  • ramcharan 

Similar News

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

Copyright @2026

Powered by Blink CMS