అజ్ఞాత హీరో అతనని తెలిస్తే ఏమవుద్దో

Update: 2017-03-22 07:30 GMT
ఒక్కో సినిమాను మార్కెటింగ్ చేయడానికి ఒక్కో వినూత్న టెక్నిక్ వాడుతుంటారు. అప్పట్లో దర్శకుడు గుణశేఖర్ అసలు హీరోయిన్ ఫేస్ చూపించకుండా ''వరుడు'' సినిమాను బీభత్సంగా మార్కెటింగ్ చేశాడు. కాకపోతే సినిమా రిలీజయ్యాక హీరోయిన్ ఫేసులో జనాలు ఊహించినంత కిక్ లేకపోవడంతో.. ఆమెనే చివరకు సినిమాకు పెద్ద మైనస్ అయ్యింది. ఇక కంటెంట్ కూడా తేలిపోవడంతో సినిమా డిజాష్టర్ అయ్యింది.

ఇప్పుడు ''రక్షక భటుడు'' అంటూ ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పోస్టర్లలో హీరో ఫేస్ బదులు పోలీసు డ్రస్సులో ఉన్న ఒక కటౌట్ కు ఆంజనేయస్వామి తలను పెట్టేసి.. రచ్చ రచ్చ చేస్తున్నారు. మాజీ ఎయిర్ హోస్టెస్ రిచా పనయ్ ఈ సినిమాలో హీరోయిన్ గా విపరీతమైన అందాలను ఆరబోస్తోంది. అయితే ఈ సినిమాలో హీరో ఎవరయ్యా అంటే.. 100% లవ్ వంటి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ చేసిన నందు.. ఈ సినిమాలో మెయిన్ లీడ్ అని తెలుస్తోంది. మరి చివరకు ఫేస్ రివీల్ చేశాక.. నందు ఈ సినిమాలో హీరో అనగానే.. ఆడియన్స్ తాము ఊహించుకున్న హీరోయిజంకు కనక్ట్ అవుతారా?

సదరు అజ్ఞాత హీరో ఈ రొమాంటిక్ సినిమాలను చేసుకునే హీరో అని తెలియగానే.. వెంటనే ఆడియన్స్ యాక్షన్ పార్ట్స్ నుండి డిస్ కనక్ట్ అయ్యే ఛాన్సుంటుంది. అందుకే ఇలా హీరో మొహం తెలియకుండా మార్కెటింగ్ చేస్తాం అనే టెక్నిక్ అంత సేఫ్‌ కాదేమో. లెటజ్ సీ!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News