చెయ్-సామ్ రిసెప్షన్ లేనట్లేనా?
అక్కినేని నాగచైతన్య- సమంత.. ఇప్పుడు భార్యాభర్తలుగా మారిపోయారు. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట.. ఈ నెల 6న శాస్త్రోక్తంగా కుటంబ సభ్యుల మధ్య వివాహం చేసుకున్నారు. అయితే.. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడంతో.. మరికొన్ని రోజుల్లోనే హైద్రాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తారని అంతా భావించారు.
చెయ్-సామ్ ల పెళ్లికి అక్కినేని.. దగ్గుబాటి.. సమంత కుటుంబాల నుంచి సభ్యులతో పాటు.. సామ్ కు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన చిన్మయి.. రాహుల్ రవీంద్రన్.. వెన్నెల కిషోర్ వంటి అతి కొద్ది మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఇప్పుడు రిసెప్షన్ విషయానికి వస్తే.. అక్కినేని ఫ్యామిలీకి రిసెప్షన్ ఇచ్చే ఉద్దేశ్యం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం రాజు గారి గది2 చిత్రం కోసం మామాకోడళ్లు అయిన నాగార్జున.. సమంతలు ఇద్దరూ తెగ ప్రచారం చేసేస్తున్నారు. ఈ సమయంలో వారికి రిసెప్షన్ ఎప్పుడనే ప్రశ్న ఎదురైంది.
తనకు చైతు.. సమంతలు ఎప్పుడు డేట్స్ ఇస్తే.. అప్పుడు రిసెప్షన్ నిర్వహిస్తానంటూ జోక్ చేస్తున్నారు నాగార్జున. అంతే కాదు.. తీరిగ్గా ఓ నెల రోజుల సమయం చూసుకుని అప్పుడు నిర్వహించవచ్చు కదా అంటున్నారు. పెళ్లి అయిన నెల నెలన్నర తర్వాత రిసెప్షన్ అంటేనే.. చాలా మందికి డౌట్ వచ్చేస్తోంది. అసలు వీరి రిసెప్షన్ చేసే ఉద్దేశ్యం అక్కినేని ఫ్యామిలీకి లేదని టాక్.