ప్రేక్షకుల మీద పడితే ఏం లాభం అమ్మడు?
కొత్త కథలు, మేకింగ్ వైపు తెలుగు ప్రేక్షకులు ఆకర్షితులవుతున్నారు. సినిమాను లోతుగా విశ్లేషించే స్థాయికి ఆడియన్స్ ఎదిగారు అన్నది కాదనలేని నిజం. తెలుగు ఆడియన్స్ ఇప్పుడు సినిమాల్లో స్టార్స్ ని చూడటం లేదు.;
కొత్త కథల్ని, కాన్సెప్ట్ ల్ని ఆస్వాదించడంలో? తెలుగు ఆడియన్స్ ఎంతో మారారు అనడానికి ఎన్నో విజయాల్ని చెప్పొచ్చు. ఒకప్పటిలా మూస సినిమాలు తీస్తే తెలుగు జనాలు చూడటం లేదన్నది వాస్తవం. నాలుగు పాటలు. .ఆరు ఫైట్లు పెట్టి బొమ్మ ఆడించేద్దామంటే? జనాలు పబ్లిక్ గానే ఇవేం సినిమాలని మైక్ ముందుకొచ్చి మరీ చీవాట్లు పెడుతున్నారు. కొత్త కథలు, మేకింగ్ వైపు తెలుగు ప్రేక్షకులు ఆకర్షితులవుతున్నారు. సినిమాను లోతుగా విశ్లేషించే స్థాయికి ఆడియన్స్ ఎదిగారు అన్నది కాదనలేని నిజం. తెలుగు ఆడియన్స్ ఇప్పుడు సినిమాల్లో స్టార్స్ ని చూడటం లేదు.
టాలీవుడ్ ట్రెండ్ మారింది:
ఇమేజ్ అనే చట్రం దాటొచ్చి సినిమాను ఆస్వాదిస్తున్నారు. సినిమాలో కొత్తగా ఏముందో చూస్తున్నారు. రివ్యూలు, పబ్లిక్ టాక్ లు చూసి జనాలు థియేటర్ కి వస్తున్నారు. కేరళ, తమిళ కాన్సెప్ట్ లకు తెలుగు ఆడియన్స్ ఎంతగానో కనెక్ట్ అవుతున్నారు. వాటిలో పెద్ద పెద్ద స్టార్స్ లేకపోయినా కథా బలమున్న చిత్రంగా ప్రోత్సహిస్తున్నారు. ఇది చాలదా? తెలుగు ఆడియన్స్ ఎంతగా మారారు? అనడానికి. అంతెందుకు 15 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన `అవతార్` గురించి అప్పుడంత గొప్పగా తెలుగులో మాట్లాడుకోలేదు. కానీ ఇప్పుడు అదే `అవతార్` గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతున్నారు.
పరదా విషయంలో అనుపమ:
15 ఏళ్ల తర్వాత ప్రేక్షకులు...జనరేషన్ మధ్య వచ్చిన వ్యత్యాసమది. `అవతార్ 3` గురించి కొంతమంది పాజిటివ్ గా మాట్లాడుతుంటే. మరికొంత మంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. ఓపెన్ గా ఎవరి అభిప్రాయాన్ని వారు పంచుకున్నారు. ఇదంతా ప్రేక్షకుల్లో వచ్చిన గొప్ప అవేర్ నెస్ గా చెప్పొచ్చు. కానీ ఈ విషయంలో ప్రేక్షకుల్ని అంచనా వేయడంలో మాలీవుడ్ నటి అనుపమా పరమేశ్వరన్ మాత్రం బొక్క బోర్లా పడింది. ఆ మధ్య అమ్మడు నటించిన లేడీ ఓరియేంటెడ్ చిత్రం `పరదా` రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అనుపమ నటించిన తొలి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ఇది.
ఇది ఎవరి వైఫల్యం:
ఈ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. ఈ ప్లాప్ విషయంలో అనుపమ వాదన ఎంతో భిన్నంగా ఉంది. కమర్శియల్ సినిమాలకు ఉన్న ప్రాధాన్యత కాన్సెప్ట్ సినిమాలకు ప్రేక్షకులు ఇవ్వడం లేదని వ్యాఖ్యా నించింది. ఇమేజ్ ఆధారంగా తెలుగులో సినిమాలు ఆడుతున్నాయని అభిప్రాయపడింది. కానీ అవన్నీ పదేళ్ల క్రితం నాటి వ్యాఖ్యలు అన్నది గమనించలేకపోయింది. `పరదా` సినిమాకు రివ్యూలు గానీ, పబ్లిక్ టాక్ పాజిటివ్ గా రాలేదు. సగటు ప్రేక్షకుడి నుంచి పెదవి విరుపే కనిపించింది. మరి దీన్ని సినిమా వైఫల్యమంటారా? ప్రేక్షకుల వైఫల్యమంటారా!