వారణాసి.. ఐమాక్స్ ఫార్మాట్ వెనుక జక్కన్న అసలు సీక్రెట్ ఇదే!
ఇండియన్ సినిమా రేంజ్‌ను వరల్డ్ లెవల్‌కు తీసుకెళ్లిన రాజమౌళి, ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న 'వారణాసి' కోసం మరో భారీ సాహసానికి తెరలేపారు.;
ఇండియన్ సినిమా రేంజ్‌ను వరల్డ్ లెవల్‌కు తీసుకెళ్లిన రాజమౌళి, ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న 'వారణాసి' కోసం మరో భారీ సాహసానికి తెరలేపారు. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుండి ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ముఖ్యంగా ఈ సినిమాను 'IMAX' ఫార్మాట్ లోనే షూట్ చేయడం ఒక కొత్త రకమైన క్యూరియాసిటీని పెంచింది. అసలు సాధారణ కెమెరాలతో కాకుండా ఇంత భారీ ఫార్మాట్‌ను రాజమౌళి ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది.
దీనిపై రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి చాలా క్లారిటీగా సమాధానం ఇచ్చారు. ఈ సినిమా కోసం ఐమాక్స్ ఫార్మాట్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం కథలోని స్కేల్ అని చెప్పారు. వారణాసి కథ కేవలం ఒక ప్రదేశానికి పరిమితం కాకుండా, చాలా విశాలమైన పరిధిలో సాగుతుంది. అలాంటి భారీ విజువల్స్‌ను ప్రేక్షకులకు సరిగ్గా చూపించాలంటే ఐమాక్స్ లాంటి పెద్ద స్క్రీన్ ఫార్మాట్ అవసరమని జక్కన్న భావించారట. తన విజన్‌ను వెండితెరపై పక్కాగా ప్రెజెంట్ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్లియర్ గా అర్థమవుతోంది.
రాజమౌళి మాట్లాడుతూ.. ఈ సినిమాలో అంటార్కిటికా మంచు కొండలు, రామాయణానికి సంబంధించిన కొన్ని కీలక ఘట్టాలు ఉంటాయి. ఇవి చాలా ఎత్తుగా, భారీగా కనిపించే విజువల్స్. అంటార్కిటికాలోని ఐస్ షెల్ఫ్‌లు లేదా రామాయణ కాలం నాటి ఆ భారీ కట్టడాలను మామూలు స్క్రీన్లపై చూస్తే ఆ ఫీల్ రాదని, వాటిని పూర్తిగా కవర్ చేయడానికే ఐమాక్స్ ఫార్మాట్ లో షూట్ చేస్తున్నారట. ప్రతి ఫ్రేమ్ లోనూ ఆ గ్రాండియర్ కళ్లముందు కదలాడాలనేది డైరెక్టర్ తాపత్రయమని అర్ధమవుతుంది.
సాంకేతిక విషయాల కంటే తన విజన్ మీద ఎక్కువ క్లారిటీ ఉంటుందని చెప్పారు. "నాకు ఒక విజన్ ఉంటుంది, దాన్ని ఆవిష్కరించడానికి ఏది బెస్ట్ అనేది మా టీమ్ ఆలోచిస్తుంది.. అలానే ఐమాక్స్ లోకి వచ్చాం" అని ఆయన చెప్పుకొచ్చారు. టెక్నికల్ అంశాలను డీఓపీ చూసుకున్నా, అవుట్‌పుట్ మాత్రం వరల్డ్ క్లాస్ లెవల్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఐమాక్స్ కెమెరాల వల్ల విజువల్స్ చాలా షార్ప్ గా, రియలిస్టిక్ గా ఉండి ప్రేక్షకులను ఆ కథలో ఒక భాగంగా మారుస్తాయని చెప్పొచ్చు.
మహేష్ బాబును ఐమాక్స్ స్క్రీన్ పై చూడటం అంటే అభిమానులకు ఇది ఒక రకమైన ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. రాజమౌళి గత చిత్రాల కంటే వారణాసి విజువల్ గా మరో మెట్టు పైనే ఉండబోతోందని ఈ మాటలను బట్టి స్పష్టమవుతోంది. కేవలం అడ్వెంచర్ మాత్రమే కాదు, అందులో ఉండే ఎమోషన్ కూడా ఈ భారీ స్క్రీన్ ఫార్మాట్ వల్ల ప్రేక్షకులకు మరింత లోతుగా కనెక్ట్ అవుతుందట. అందుకే బడ్జెట్ ఎంతైనా సరే మేకర్స్ క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడటం లేదు.
'వారణాసి' సినిమాతో రాజమౌళి ఇండియన్ సినిమాకు ఒక కొత్త టెక్నికల్ ఎక్స్‌పీరియన్స్‌ను పరిచయం చేయబోతున్నారు. అంటార్కిటికా నుండి రామాయణ కాలం వరకు సాగే ఈ జర్నీని ఐమాక్స్ లో చూడటం అంటే అది ఒక క్రేజీ రైడ్ అని చెప్పాలి. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కాబోతున్న ఈ గ్లోబల్ అడ్వెంచర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.