గ్లామర్ ట్రీట్ తో కట్టిపడేస్తున్న జూనియర్ అనుష్క..
ఇదిలా ఉండగా మరొకవైపు ఈమె రవితేజ హీరోగా నటిస్తున్న 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.;
జూనియర్ అనుష్కగా తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరును దక్కించుకుంది ప్రముఖ యంగ్ బ్యూటీ ఆషికా రంగనాథ్. గతంలో నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగా అనే సినిమాలో తన అద్భుతమైన నటనతో తెలుగు సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమెకి పెద్దగా అవకాశాలు తలుపు తట్టలేదు. కానీ అనుష్క శెట్టికి దగ్గర పోలికలు ఉండడంతో జూనియర్ అనుష్క అనే పేరును మాత్రం సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఇతర హీరోయిన్లతో పోల్చుకుంటే ఆషికా రంగనాథ్ సోషల్ మీడియాలో కాస్త తక్కువగానే యాక్టివ్ గా ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో ఈమె కూడా ఇప్పుడు తన ఉనికిని చాటుకోవడానికి గ్లామర్ ఫోటోలతో సందడి చేస్తోంది అని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా మరొకవైపు ఈమె రవితేజ హీరోగా నటిస్తున్న 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాదు ఇందులో ఈమె 'బెల్లా బెల్లా' అనే పాటలో అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చి ఆడియన్స్ ను మెప్పించింది. దీనికి తోడు డిసెంబర్ 19న ఈ సినిమా నుండి టీజర్ విడుదలవగా ఇందులో రవితేజ స్నేహితురాలిగా ఆషికా నటించింది. అలాగే ఆయన భార్య పాత్రలో డింపుల్ హయతి మరోసారి సందడి చేసిందని చెప్పవచ్చు . ఇదిలా ఉండగా తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో బికినీను తలపించేలా డ్రెస్ ధరించడంతో హోమ్లీ అమ్మాయి అనే పదానికి బ్రేక్ చెప్పింది అని చెప్పవచ్చు. మొత్తానికి అయితే రెడ్ కలర్ బికినీను తలపించే డ్రెస్ వేసుకొని తన అందాలతో అందరిని ఆశ్చర్యపరిచింది ఆషికా రంగనాథ్ . ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
కర్ణాటకలోని తుమకూరు ప్రాంతానికి చెందిన ఈమె.. చిన్నతనం నుండే సినిమాలపై ఎక్కువ ఆసక్తి పెంచుకుంది. అయితే చదువును మాత్రం అశ్రద్ధ చేయలేదు. బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలని కలలు కన్న ఈమె.. ఎప్పుడూ క్లాసులో ఫస్ట్ ఉండేదట. అలా ఇంటర్ వరకు తమ ఊర్లోనే చదువుకున్న ఈమె.. డిగ్రీ కోసం తొలిసారి బెంగళూరు వెళ్ళింది. అక్కడ జ్యోతి నివాస్ కాలేజీలో చేరిన తర్వాతే ఆమె జీవితం మలుపు తిరిగిందట. తనుకు డాన్స్ అంటే చాలా ఇష్టం. చదువుకుంటూనే ప్రత్యేక కోర్సులు కూడా చేసిందట. ఇక క్లాసులు అయిపోగానే మ్యూజిక్ పెట్టుకుని గంటల తరబడి డాన్స్ చేసేదాన్ని అని గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.
డిగ్రీ చదువుతున్నప్పుడే తన అక్క అనూష రంగనాథ్ కి కన్నడ సీరియల్స్ లో నటించే అవకాశం లభించిందట. దాంతో తన అక్కను చూశాక తనకు కూడా కెమెరా ముందు నటించాలనిపించిందట. ఇక అప్పుడే కాలేజీలో క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ పోటీలు జరగగా.. అందులో పాల్గొని రన్నరప్ టైటిల్ ను దక్కించుకుంది. ఆ పోటీలకు సంబంధించిన ఫోటోలు పేపర్లో రావడంతో ఆ ఫోటోలు చూసిన కన్నడ దర్శకుడు 2016లో క్రేజీ బాయ్ అనే సినిమాలో అవకాశం ఇవ్వడంతో అలా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందట ఈ ముద్దుగుమ్మ. తెలుగులో అమీగోస్ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది.