ఎనర్జిటిక్ రామ్ హిట్ కోసం కొత్త ఫార్ములా!
ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న మెరుపుతీగలాంటి హీరో రామ్. టాలెంట్. అందుకు తగ్గ అన్ని అంశాలు ఉన్నా కానీ ఎందుకో రామ్ రేసులో వెనకబడిపోతున్నాడు.;
ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న మెరుపుతీగలాంటి హీరో రామ్. టాలెంట్. అందుకు తగ్గ అన్ని అంశాలు ఉన్నా కానీ ఎందుకో రామ్ రేసులో వెనకబడిపోతున్నాడు. మిగత హీరోలంతా బ్లాక్ బస్టర్లు, పాన్ ఇండియా హిట్‌లని తమ ఖాతాలో వేసుకుంటూ తమ మార్కెట్ పరిథిని పెంచుకుంటుంటే రామ్ మాత్రం ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. బ్లాక్ బస్టర్లని దక్కించుకునే చరిష్మా, టాలెంట్ ఉన్నా కానీ ఆ స్థాయిలో సినిమాలు చేయలేక రేసులో వెనకడిపోయాడు.
కొత్తగా ట్రై చేయాలని రామ్ చేసిన మూవీ `ఆంధ్రా కింగ్ తాలూకా`. మహేష్ బాబు పి డైరెక్ట్ చేసి ఈ సినిమా నవంబర్ 27న విడుదలైంది. ఉపేంద్ర కీలక పాత్రలో నటించి ఈ మూవీ రామ్‌కు బ్లాక్ బస్టర్ హిట్‌ని అందిస్తుందని అంతా భావించారు. కానీ టాక్ బాగున్నా ఫలితం మాత్రం శూన్యం. దాదాపు రూ.56 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.34 కోట్లు మాత్రమే రాబట్టి తీవ్ర నిరాశకు గురి చేసింది. బడ్జెట్‌లో కేవలం కొంత మేరే రికవరీ కావడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడట రామ్.
ఏరి కోరి చేసిన ఈ సినిమా నిరాశ పరచడంతో ఆలోచనలో పడిన రామ్ ఇప్పుడు కొత్త ప్రయోగానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. `ఇస్మార్ట్ శంకర్` మూవీతో కెరీర్ బ్లాక్ బస్టర్‌ని సొంతం చేసుకున్న రామ్ అప్పటి నుంచి ఆ స్థాయికి మించిన హిట్ కోసం విశ్వప్రయత్నాలే చేస్తున్నాడు కానీ సక్సెస్ కావడం లేదు. దీంతో మాస్ ఫార్ములాని పక్కన పెట్టిన రామ్ ఈ సారి సరికొత్త జానర్ హారర్ థ్రిల్లర్‌ని ఎంచుకున్నాడు. స్క్రిప్ట్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టి మరిన్ని మార్పులు చేస్తున్నాడట.
`బాహుబలి` మేకర్స్ ఆర్కా మీడియా బ్యానర్‌పై అత్యంత భారీ స్కేల్‌లో ఈ మూవీని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ ద్వారా కిషోర్ తిరుమల శిష్యుడు కిషోర్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఫైనల్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ మూవీని జనవరి నుంచి పట్టాలెక్కిస్తున్నారు. సరికొత్త జానర్ ట్రై చేస్తున్న రామ్ ఈసినిమాతో ఖచ్చితంగా కమ్ బ్యాక్ అవుతాడని, ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ని తన ఖతాలో వేసుకుని ట్రాక్‌లోకి వచ్చేస్తాడని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి రామ్ హారర్ థ్రిల్లర్‌తో కచ్చితంగా కమ్ బ్యాక్ అవుతాడా? అన్నది వేచి చూడాల్సిందే.