బుట్ట బొమ్మలా అందాలు ఆరబోస్తున్న బాలయ్య బ్యూటీ!
అదృష్టం తలుపు తడితే ఒక్క సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకునే సెలబ్రిటీలు చాలా తక్కువ మంది అని చెప్పాలి.;
అదృష్టం తలుపు తడితే ఒక్క సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకునే సెలబ్రిటీలు చాలా తక్కువ మంది అని చెప్పాలి. అయితే ఆ అదృష్టం కోసం పరితపించే వారు కూడా చాలా ఎక్కువే ఉన్నారు. అందులో భాగంగానే ముందుగా సోషల్ మీడియాలో అందంతో ఆకట్టుకొని ఫాలోవర్స్ ను పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.. ఈ క్రమంలోనే చాలామంది హీరోయిన్స్ ఇంస్టాగ్రామ్ వేదికగా భిన్న విభిన్నమైన వస్త్రధారణలలో అందాలు అరబోస్తూ అభిమానులకు మరింత చేరువవుతున్నారు. అలాంటి వారిలో ప్రముఖ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ కూడా ఒకరు. తన అందం , అభినయంతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకునే హీరోయిన్స్ జాబితాలో ప్రథమ స్థానంలో నిలుస్తుంది ఈ ముద్దుగుమ్మ.
బాలీవుడ్ లో జరిగే ఈవెంట్లలో కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచే ఈమె.. తాజాగా బుట్టబొమ్మలా తయారయ్యి అందరిని ఆకట్టుకుంది. తాజాగా ప్లేర్డ్ బ్లాక్ కలర్ గౌన్ ధరించిన ఈమె.. తన అందాలతో మరోసారి మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా బుట్ట బొమ్మలా ఫోటోలకు ఫోజులిస్తూ.. కుర్రాల గుండెల్లో గుణపాలు దించేసింది. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక అద్భుతమైన ఔట్ఫిట్ తో అందరి దృష్టిని ఆకర్షించింది ప్రగ్యా జైస్వాల్. అమ్మడి అందానికి అభిమానులు ఫిదా అవ్వడమే కాకుండా లవ్ ఎమోజీలు , ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తూ కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. మొత్తానికైతే ప్రగ్య జైస్వాల్ షేర్ చేసిన ఈ బ్యూటిఫుల్ ఫోటోలు నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
1991 జనవరి 12న జబల్పూర్ లో జన్మించిన ప్రగ్య జైస్వాల్ మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. అయితే మోడల్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకముందే సింబయాసిస్ కాలేజీలో చదువుతూ అక్కడి నుంచే తన మోడలింగ్ వృత్తిని మొదలు పెట్టింది. అలా 2014లో జనవరి 22న జరిగిన కళా, సాంస్కృతిక రంగంలో ఆమె సాధించిన విజయానికి గానూ సింబయాసిస్ సాంస్కృతిక పురస్కారం లభించింది. ఫెమినా మిస్ ఇండియా 2018 లో పాల్గొని మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ డాన్సింగ్ క్వీన్, మిస్ ఫ్రెండ్ ఆఫ్ ఎర్త్ టైటిల్స్ ను సొంతం చేసుకుంది.
అలాగే డాబర్ వాటిక, డవ్, మిలీనియం హైపర్ మార్కెట్ ఫర్ దుబాయ్, రిలయన్స్ డిజిటల్ వంటి ఎన్నో పాపులర్ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరించింది. అలా తన అందంతో గ్లోబల్ మార్కెట్లో పాపులారిటీ దక్కించుకున్న ఈమె హిందీతో పాటు తెలుగు, తమిళ్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది.
తొలిసారి తెలుగులో మిర్చి లాంటి కుర్రాడు అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ప్రగ్యా జైస్వాల్.. తన అద్భుతమైన నటనను కనబరిచి ఆకట్టుకుంది. ఇక బాలయ్య నటించిన అఖండ , డాకూ మహారాజ్ సినిమాలలో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె బాలయ్య బ్యూటీగా కూడా పేరు దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగులో సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. అందులో భాగంగానే ఇలా ఫోటోషూట్ తో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.