ఎడిటర్ పాత్ర దారి తప్పుతోందా?
ఒక సినిమాకు టెక్నీషియన్స్ ప్రధాన భూమిక పోషిస్తుంటాడు. ఎడిటర్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిందే.;
ఒక సినిమాకు టెక్నీషియన్స్ ప్రధాన భూమిక పోషిస్తుంటాడు. ఎడిటర్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిందే. ఎందుకంటే డైరెక్టర్ అనుకున్న దానికి మించి నిడివితో సినిమా తీసినా దాన్ని పర్ఫెక్ట్‌గా కట్ చేసి సరైన రూపుకు తీసుకురావడంలో ఎడిటర్ కీ రోల్ పోషిస్తుంటాడు. డైరెక్టర్ ఎంత బాగా తీసినా దాన్ని సరైన క్రమంలో సీన్ టు సీన్ కట్ చేయకపోయినా..ఎక్కడా హై ఇవ్వాలి..ఎక్కడ లో ఇవ్వకపోయానా... టెంపోని కరెక్ట్‌గా మెయింటైన్ చేయలేకపోయినా సినిమా పరిస్థితి గోవిందా గోవిందా అనాల్సిందే.
ఇలా ఎడిటర్ కరెక్ట్‌గా వ్యవహరించని చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సినిమాలో సరుకు ఏమీ లేకపోయినీ ఎడిటర్ చేసిన జిమ్మిక్కులతో సక్సెస్ అయినవి కూడా చాలానే ఉన్నాయి. ఇండస్ట్రీలో కొంత మంది ఎడిటర్లను మాత్రమే పర్టికులర్‌గా డైరెక్టర్‌లు ఎంచుకోవడానికి ప్రధాన కారణం కూడా ఇదే. ఒక ఎడిటర్‌తో ప్రయాణం మొదలు పెట్టిన దర్శకులు ఏళ్ల తరబడి వారినే కంటిన్యూ చేస్తూ ఉంటారు కారణం డైరెక్టర్ మైండ్‌కు తగ్గట్టుగా ఎడిటర్ సినిమాని కట్ చేసి సక్సెస్‌లో భాగం కావడమే.
అయితే ఈ మధ్య కొంత మంది ఎడిటర్లు దారి పడుతున్నట్టు కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఎడిటర్ అనే వాడు ఎప్పుడూ డైరెక్టర్ ఆలోచనకు తగ్గట్టుగా తను చెప్పింది చెప్పినట్టు చేయాలి. అలా చేసినప్పుడు అనుకున్న అవుట్‌పుట్ పర్‌ఫెక్ట్‌గా వస్తుంది. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. కానీ ఇప్పుడు కొంత మంది ఎడిటర్స్ డైరెక్టర్స్ విజన్ కంటే ప్రొడ్యూసర్‌ల మాటలకే ప్రాముఖ్యత నిస్తున్నారు. ప్రొడ్యూసర్లని సంతృప్తి పరచడమే లక్ష్యంగా పని చేస్తూ డైరెక్టర్లని పక్కన పెట్టేస్తున్నారు.
దాంతో ఆయా సినిమాల ఫలితం మారిపోతోంది. రీసెంట్‌గా విడుదలైన ఓ సినిమానే దీనికి అద్యంపడుతోంది. కామెడీ ప్రధానంగా తెరకెక్కిన సదరు మూవీలోని సీన్‌లు అతుకులు, అతుకులుగా ఉన్నాయని, సినిమా ఓ పద్దతి ప్రకారం లేదనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఎడిటింగ్ కూడా అక్కడక్కడ ప్యాచీగా ఉందని విమర్శలు చేస్తున్నారు. దాని వల్లే సినిమా అస్తవ్యస్తంగా ఉందని చెబుతున్నారు. అంటే ఎడిటర్ డైరెక్టర్ చెప్పింది కాకుండా ప్రొడ్యూసర్‌కు నచ్చినట్టు ఎలా పడితే అలా ఎడిట్ చేయడం వల్లే సినిమా అంతా ప్యాచీలు ప్యాచీలుగా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.