2025 పిల్లలకు ఇచ్చాడు.. 2026 తాను దిగుతున్నాడు..

అంతేకాదు వచ్చే ఏడాది కోసం ముందుగానే ప్లాన్ చేసుకున్న ఈయన.. బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరి ఆయన ఎవరో ఇప్పుడు చూద్దాం.;

Update: 2025-12-20 11:30 GMT

సినీ ఇండస్ట్రీలో తమకంటూ ఒక గుర్తింపు లభించిన తర్వాత చాలామంది సెలబ్రిటీలు తమ వారుసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. వారిని ఇండస్ట్రీకి పరిచయం చేయడమే కాదు వారికంటూ సక్సెస్ తీసుకురావడంలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారనడంలో సందేహం లేదు. మరోవైపు కొంతమంది హీరోలు తమ పిల్లల ఎంట్రీ కోసం ఏకంగా తమ సినీ కెరీర్ కి కూడా గ్యాప్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరో ఈ ఏడాదిని తన పిల్లల కోసం కేటాయించి.. ఇప్పుడు వచ్చే ఏడాది తనకోసం కేటాయించుకోబోతున్నారు. అంతేకాదు వచ్చే ఏడాది కోసం ముందుగానే ప్లాన్ చేసుకున్న ఈయన.. బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరి ఆయన ఎవరో ఇప్పుడు చూద్దాం.

ఆయన ఎవరో కాదు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకోవడమే కాకుండా ఆసియా ఖండంలోనే అత్యధిక ధనవంతుల జాబితాలో ఒకరిగా పేరు సొంతం చేసుకున్నారు. వేలకోట్ల ఆస్తులను కలిగి ఉన్న ఈయన బాలీవుడ్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటూ మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇకపోతే అలా వరుస చిత్రాలతో.. భారీ ఆదాయంతో అందరి దృష్టిని ఆకట్టుకున్న షారుక్ ఖాన్ ఈ ఏడాదిని తన పిల్లల కోసం కేటాయించిన విషయం తెలిసిందే..

అందులో భాగంగానే షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ తన తొలి ప్రయత్నంలో దర్శకుడిగా అడుగులు వేశారు. అలా బ్యాడ్స్ అఫ్ బాలీవుడ్ అనే వెబ్ సిరీస్ నిర్మించి.. నెట్ఫ్లిక్స్ వేదికగా దీనిని స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇందులో రాజమౌళి, అమీర్ ఖాన్ , కరణ్ జోహార్ లాంటి బాలీవుడ్ భారీ తారాగణం కూడా భాగమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎంతోమంది సౌత్ నుంచి బాలీవుడ్ వరకు బడా సెలబ్రిటీలు ఇందులో నటించడమే కాకుండా ఆర్యన్ తొలి ప్రయత్నానికి సెలబ్రిటీలు ఫిదా అయిపోయారు. ఇటీవల వచ్చిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

మరొకవైపు షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కూడా ఈ ఏడాది తన సినిమాను ప్రారంభించింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం కింగ్ లో నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. ఇందులో షారుక్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా తన యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టబోతున్నారు. అటు సుహానా ఖాన్ కూడా ఈ చిత్రం కోసం ఇంటెన్సిటీ యాక్షన్ శిక్షణను తీసుకోవడమే కాకుండా తన యాక్షన్ పర్ఫామెన్స్ తో సినిమాకే హైలెట్గా నిలవనుంది అని సమాచారం. ఇకపోతే సుహానా ఖాన్ గతంలో జోయా అక్తర్ నటించిన ది ఆర్చీస్ అనే సినిమా ద్వారా అరంగేట్రం చేసింది.

ఇకపోతే షారుక్ ఖాన్ 2023లో పఠాన్ అనే సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత జవాన్ సినిమా చేసి ఈ రెండు చిత్రాలతో ఏకంగా వెయ్యి కోట్ల క్లబ్లో చేరిపోయారు. ఇక 2024 - 2025 ఏడాది తన పిల్లల కెరియర్ కోసం బ్రేక్ తీసుకున్న ఈయన .. ఇప్పుడు తన కెరియర్ పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే వచ్చే ఏడాది కింగ్ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్నట్లు సమాచారం.. అంతేకాదు ఆ తర్వాత చిత్రాలను కూడా అదే రేంజిలో సెలెక్ట్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News