కొడుకు ఈవెంట్ కు వచ్చేందుకు సుమ నో.. ఏం జరిగిందంటే?
యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కొడుకు రోషన్ కనకాల.. రీసెంట్ గా మోగ్లీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.;
యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కొడుకు రోషన్ కనకాల.. రీసెంట్ గా మోగ్లీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమా.. డిసెంబర్ 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రీసెంట్ గా హైదరాబాద్ లోని థ్యాంక్స్ మీట్ నిర్వహించారు మూవీ మేకర్స్.
ఆ ఈవెంట్ కు అటెండ్ అయిన రోషన్ కనకాల.. వేదికపై ఎమోషనల్ అయ్యారు. ముందుగా సినిమాను ఆదరించిన మూవీ లవర్స్ కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఆ తర్వాత సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. అనేక మంది టాలీవుడ్ హీరోలు, వారి అభిమానులు తనకు ఫుల్ గా సపోర్ట్ చేశారని చెప్పుకొచ్చారు.
హార్డ్ వర్క్, టాలెంట్, డిసిప్లిన్ ఈ మూడే ఎవరి సక్సెస్ అయినా కూడా డిసైడ్ చేస్తాయని చెప్పిన రోషన్.. మోగ్లీ సినిమా కోసం ప్రాణం పెట్టి కష్టపడ్డానని తెలిపారు. టీమ్ అంతా ఎంతో హార్డ్ వర్క్, లవ్ తో చేశారని కొనియాడారు. అయితే మోగ్లీని ఆడియన్స్ గెలిపించారన్న రోషన్.. ఆ తర్వాత తన పేరెంట్స్ సుమ, రాజీవ్ గురించి మాట్లాడారు.
మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని అమ్మ సుమను అడిగానని, కానీ ఆమె 'నీ హార్డ్ వర్క్ నమ్మి ముందుకు సాగు' అని చెప్పినట్టు గుర్తు చేశారు. సినిమా కోసం హార్డ్ వర్క్ చేశానని, కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అమ్మ నాన్న ఇలా ఈవెంట్స్ కు రాలేరని తెలిపారు. ఒకవేళ వచ్చుంటే వారిద్దరి కాళ్లు మొక్కి నమస్కరించేవాడినని అన్నారు.
ఎందుకంటే వాళ్లు లేకుంటే తాను లేనని, థాంక్యూ అమ్మా. థాంక్యూ నాన్న అంటూ ప్రేమను వ్యక్త పరిచారు. ప్రస్తుతం రోషన్ కనకాల కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. ఇక మోగ్లీ విషయానికొస్తే.. కలర్ ఫోటో మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన సందీప్ రాజ్.. మోగ్లీ సినిమాకు దర్శకత్వం వహించారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ రూపొందించగా.. మూవీలో రోషన్ సరసన సాక్షి మడోల్కర్ హీరోయిన్ గా నటించారు. బండి సరోజ్ కుమార్ విలన్ రోల్ లో కనిపించగా.. హర్ష చెముడు కీలక పాత్ర పోషించారు. వారితో పాటు సుహాస్, రియా సుమన్ అతిథి పాత్రల్లో నటించారు. కాలభైరవ మ్యూజిక్ అందించారు.
మోగ్లీ కథేంటంటే.. సినిమాలో అనాథైన రోషన్, ఎస్సై కావాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. షూటింగ్స్ లో పనిచేస్తూ కడుపు నింపుకుంటాడు. అప్పుడు ఓ మూవీల డూప్ గా నటించాల్సి వస్తుంది. ఆ సమయంలో డాన్సర్ తో ప్రేమలో పడతాడు. అప్పుడే ఎస్సై వారి మధ్యలోకి వస్తాడు. అతడు కూడా హీరోయిన్ పై కన్నేసి లోబరుచుకోవాలని చూస్తాడు. దీంతో హీరో హీరోయిన్లు అడవిలో ఉంటారు. చివరకు ఏమైందనేది పూర్తి సినిమా.