భక్త నాగ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది

Update: 2016-08-29 04:48 GMT

అటు సోగ్గాడి గాను.. ఇటు ఊపిరితోను వరుస హిట్స్ సాధించిన అక్కినేని నాగార్జున ఇప్పుడు సడెన్ గా భక్తి మార్గం లోకి వచ్చేశాడు. హథీరాం బాబాగా తిరుమల వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడిగా నాగార్జున 'ఓం నమో వెంకటేశాయ'చిత్రంలో నాగార్జు నటిస్తున్నాడు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో.. నాగ్ ఫస్ట్ లుక్ ఇప్పుడు రిలీజ్ అయింది.

ఇంతకు ముందు నాగార్జున ప్రీలుక్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్.. ఇప్పుడు భక్తుడిగా నాగార్జున గెటప్ ని విడుదల చేసింది. కాషాయ వస్త్రాల్లో.. నిలువు బొట్టుతో.. రెండు చేతులు జోడించి ప్రణమిల్లుతున్న నాగార్జున మనకు ఈ పోస్టర్ లో దర్శనిస్తాడు. ఇప్పటికే భక్తి సినిమాలు చేసిన అనుభవం.. మొహంలో భక్తి ప్రపత్తులను చూపించేందుకు చాలా బాగా ఉపయోగపడింది.

గతంలో అన్నమయ్య..  శ్రీరామదాసు చిత్రాల్లో భక్తుడిగాను.. షిర్డీ సాయిబాబాలోనూ దేవుడిగాను కనిపించిన నాగార్జున.. మహా భక్తుడు హధీరాం బాబా రోల్ లో ఇట్టే ఒదిగిపోయాడనే చెప్పాలి. అనుష్క శెట్టి ఓ డీగ్లామర్ రోల్ లోను.. ప్రగ్యా జైస్వాల్ ప్రధాన పాత్రలోను.. విమలా రామన్ లక్ష్మీదేవి అవతారంలోను 'ఓం నమో వేంకటేశాయ' చిత్రంలో కనిపించనున్నారు.
Tags:    

Similar News