#ChaiSam సముద్రం అంచున స్వీట్ వేడుక

Update: 2017-10-06 07:04 GMT
ఫైనల్ గా అక్కినేని నాగ చైతన్య - సమంత ల వివాహ వేడుక రానే వచ్చింది. జీవితంలో రెండు మనసులు ఒకటై చేసుకునే పెళ్లి వేడుక జీవితాంతం అలా గుర్తుండిపోవాలని ఎవరైనా అనుకుంటారు. ఆ స్థాయిలోనే ఇప్పుడు అక్కినేని వారి పెళ్లి వేడుక జరగబోతోంది. వారికి ఉన్న స్థాయిలో దాదాపు 10 కోట్ల వ్యయంతో ఖర్చు పెట్టి వివాహ వేడుకను జరుపుకోబోతున్నారు.

అయితే పెళ్లి సంబరాలు ఈ రోజు ఉదయమే మొదలయ్యాయి. ఇరు కుటుంబాల నుంచి 100 మంది అతిధులు మాత్రమే హాజరుకానున్నారట. అయితే పెళ్లిలో ఎంత బిజీగా ఉన్నా కూడా ఎప్పటికప్పుడు అభిమానులకు ఆ సంబరాలకు సంబదించిన విషయాలు తెలుస్తునే ఉన్నాయి. ఇక ఉదయం నాగార్జున కొత్త పెళ్లి కొడుకుగా రెడీ అయిన నాగ చైతన్య ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. వెంకటేష్ కూడా పెళ్లి పెద్దగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నాడట. అలాగే తన ఫ్యామిలీ ఫోటో కూడా షేర్ చేసి.. త్వరలోనే సమంత జాయిన్ అవుతుంది అంటున్నాడు.

అయితే రీసెంట్ గా ఈ పెళ్ళికి సంబందించి మరొక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందమైన గోవా బీచ్ లో W Hotelలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్స్ లు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటివరకు సినిమాలో అలాంటి లుక్స్ కనిపించాయి. కానీ రియల్ లైఫ్ లో ఆ సెట్స్ లలో పెళ్లి వేడుకను సమంత - చైతు ఘనంగా చేసుకోబుతున్నారు. చల్లని సముద్రం ఒడ్డున అందమైన ప్రదేశంలో ఈ వేడుక ఎలా జరగబోతుందా అని అందరు ఎదురుచూస్తున్నారు.      


వీడియో కోసం క్లిక్ చేయండి

Tags:    

Similar News