ఫొటో టాక్‌ః కూతురుకు నాగబాబు ఎమోషనల్‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు

Update: 2020-12-18 11:30 GMT
మెగా బ్రదర్‌ నాగబాబు తన కూతురు నిహారికను ఎంతగా ప్రేమిస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి తండ్రి కూడా తన కూతురును ప్రిన్సెస్‌ మాదిరిగా చూసుకుంటాడు. కాని నాగబాబు అంతకు మించి చూసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఆమె ఏం కోరితే అది చేశారు.. చేయనిచ్చారు. ఇతరులు ఏం అనుకుంటారో అనే విషయంను ఆయన ఎప్పుడు పట్టించుకోలేదు. కూతురు కోసం ఎంతో చేసిన నాగబాబు ఇటీవలే ఆమె పెళ్లిని అంగరంగ వైభవంగా నిర్వహించాడు. ఇక నేడు ఆమె పుట్టిన రోజు అవ్వడంతో చాలా ఎమోషనల్‌ గా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు.

నిహారిక చిన్నప్పటి ఫొటోను షేర్‌ చేసి దేవుడిపై నమ్మకం లేని నాకు నీ రాకతో ఏంజిల్స్ ను నమ్మాలనిపించింది. నీ కళ్లలో ఆనందం చూసేందుకు నీ ముందు గర్వంగా ఉండేందుకు నేను చాలా చేశాను. ఈ పెళ్లి అనేది మనం ఇంకా క్లోజ్‌ అవ్వడానికి మరియు నాకు నీపై ఉన్న ప్రేమను చూపించింది అని భావిస్తున్నాను. హ్యాపీ బర్త్‌ డే నాన్న అంటూ పోస్ట్‌ చేశాడు. ఈ ఫొటోలో నిహారిక మరియు ఆమె తల్లిని కనీసం గుర్తు పట్టడానికి కూడా కష్టంగా ఉన్నారు కదా. చిన్నప్పుడే నిహరిక ఎంత క్యూట్‌ గా ఉంది.. ఆ బుగ్గలు ఎంత ముద్దు వస్తున్నాయో అంటూ మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News