ఓటిటి వెళ్తే మాకేం ఇబ్బంది లేదు కానీ...!

Update: 2020-05-18 07:50 GMT
తమిళ స్టార్ హీరో సూర్య నిర్మాణంలో తెరకెక్కిన ఒక సినిమాను నేరుగా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ మీద విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చినప్పటినుండి కూడా అక్కడ థియేటర్ల యాజమాన్యాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సూర్య సినిమాలను బహిష్కరిస్తామని అంటున్నారు. అయినా కూడా సూర్య భయపడకుండా తనకున్న ఇబ్బందుల దృష్ట్యా సినిమాను ఓటిటి లో విడుదలకు రెడీ అయ్యాడు.

ఈ విషయం గురించి ఇప్పటికే పలు మల్టీప్లెక్స్ ల యాజమాన్యాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రకటనలు జారీ చేయడం జరిగింది. తాజాగా సినిమాల ఓటిటి విడుదల గురించి ప్రముఖ మల్టీప్లెక్స్ కార్నివాల్ సీఈఓ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అతి త్వరలోనే సినిమాలు మళ్ళీ థియేటర్ లో విడుదల కాబోతున్న రోజులు రాబోతున్నాయి. అయితే అప్పుడు ఒక్కసారే సినిమాలన్నింటికీ స్క్రీన్స్ లభించవు. కునుకు కొన్ని సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద విడుదల అయితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు.

ఒక సారి ఓటిటి లో విడుదల అయిన సినిమాలను మళ్ళీ థియేటర్ల లో విడుదల కానిచ్చేది లేదన్నాడు. ఇప్పుడే కాదు ఎప్పటికి అయినా ముందు ఓటిటి లో వచ్చి ఆ తర్వాత థియేటర్లకు వస్తామంటే ఒప్పుకోము అన్నాడు. ఈ కొన్ని రోజుల సంక్షోభం నుండి థియేటర్లు బయట పడతాయని ఎలాంటి ఇబ్బంది లేకుండానే మళ్ళీ ప్రేక్షకులతో థియేటర్లు కళకళలాడుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Tags:    

Similar News