స్పిరిట్ ఫస్ట్ లుక్ .. ప్రభాస్ ఫ్యాన్స్‌కి 31 మిడ్‌నైట్ ట్రీట్
భారతదేశంలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, అపజయమెరుగని ట్యాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా భారీ యాక్షన్ ఎంటర్ టైనర్‌ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.;
భారతదేశంలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, అపజయమెరుగని ట్యాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా భారీ యాక్షన్ ఎంటర్ టైనర్‌ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 2026-27 సీజన్‌లో అత్యంత భారీ క్రేజుతో రాబోతున్న పాన్ ఇండియన్ సినిమా టైటిల్ ని కూడా ఇప్పటికే ప్రకటించారు. ఒక వాయిస్ వోవర్ తో `స్పిరిట్` టైటిల్ ని లాంచ్ చేయగా దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. అంతర్జాతీయ నేరగాళ్ల సిండికేట్ ని ఢీకొట్టే పవర్‌ఫుల్ భారతీయ ఐపిఎస్ (పోలీసాఫీసర్) అధికారిగా ప్రభాస్ ఈ చిత్రంలో కనిపించనున్నాడు.
ఇది రేర్ కలయిక. రేర్ కాంబో..! నేటితరం డైనమిక్ డైరెక్టర్ ఇండియా బిగ్గెస్ట్ కటౌట్ ప్రభాస్‌తో ఎలాంటి సంచలనాలకు తెర తీస్తాడో అనే చర్చ విస్త్రతంగా సాగుతోంది. ఇటు సౌత్ అటు నార్త్ రెండు చోట్లా ప్రభాస్- వంగా సినిమాపై భారీ అంచనాలేర్పడ్డాయి. ఇటీవలే 'స్పిరిట్' నిరవధిక షూటింగ్ ని కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ ఈ చిత్రంలో పిలక లుక్ తో యూనిక్ గా కనిపించబోతున్నాడని కూడా రివీలైంది.
అయితే కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న వేళ డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ట్రీట్ ఏదైనా ప్లాన్ చేసారా? అంటే కచ్ఛితంగా సందీప్ వంగా మార్క్ ట్రీట్ ఉంటుందని గుసగుస వినిపిస్తోంది. ఇంతకుముందు రణబీర్ కపూర్ 'యానిమల్' ఫస్ట్ లుక్ ని 2022 డిసెంబర్ 31 మిడ్ నైట్ లో లాంచ్ చేసారు. ఒకే ఒక్క ఇంటెన్స్ పోస్టర్‌తో దేశవ్యాప్తంగా చర్చించుకునేలా చేసాడు. ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ లుక్ ని కూడా అదే సెంటిమెంట్‌తో 2025 డిసెంబర్ 31 మిడ్ నైట్ లో లాంచ్ చేసేందుకు సందీప్ రెడ్డి వంగా టీమ్ సిద్ధమవుతోందని సమాచారం. ఒకే ఒక్క పోస్టర్‌తో వేవ్స్ క్రియేట్ చేయడానికి అతడు సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం పోస్టర్ రెడీ అవుతోందని గుసగుస వినిపిస్తోంది.
కొత్త సంవత్సరానికి వెల్ కం చెబుతూ ఠఫ్ కాప్ ప్రభాస్ లుక్ ని లాంచ్ చేస్తాడా? అన్నది వేచి చూడాలి. యానిమల్ సెంటిమెంట్‌ని ఇప్పుడు మరోసారి రిపీట్ చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ కి సరిపడే కంటెంట్ ని ఇప్పటికే సందీప్ వంగా షూట్ చేసాడని, 2026లో అత్యంత వేగంగా స్పిరిట్ చిత్రీకరణను పూర్తి చేసేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసాడని తెలుస్తోంది. ఒక రోజు తర్వాత ప్రభాస్ స్పిరిట్ లుక్ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చించుకోవడం ఖాయమని అంచనా వేస్తున్నారు. తాజా గుసగుసల నేపథ్యంలో డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ లో అంతకంతకు ఉత్కంఠ పెరిగిపోతోంది. ప్రభాస్ - వంగా రేర్ కలయికలోని సినిమాపై అత్యంత భారీ అంచనాలున్నాయి. ఒకే ఒక్క పోస్టర్ తో దానిని మరో లెవల్ కి తీసుకెళతాడని భావిస్తున్నారు. అయితే ఫస్ట్ లుక్ లాంచ్ గురించి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. ఏం జరగబోతోందో.. జస్ట్ వెయిట్ అండ్ వాచ్...