2026: కొత్త ఏడాది జనవరిలో రాబోతున్న చిత్రాలివే!

2026 కొత్త ఆశలతో ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా వచ్చే కొత్త సంవత్సరంలో తమ జీవితంలో ఏదో ఒక మార్పు తీసుకురావాలని ఆరాటపడుతున్నారు.;

Update: 2025-12-29 04:54 GMT

2026 కొత్త ఆశలతో ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా వచ్చే కొత్త సంవత్సరంలో తమ జీవితంలో ఏదో ఒక మార్పు తీసుకురావాలని ఆరాటపడుతున్నారు. ఇంకొంతమంది సక్సెస్ చవి చూడాలని ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమారంగం విషయానికి వస్తే.. కొత్త ఏడాది సక్సెస్ తో తమ కెరీర్ను ప్రారంభించాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2026 జనవరి నెల మొత్తం తమ కొత్త చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి కుర్ర హీరోలను మొదలుకొని స్టార్ హీరోల వరకు చాలామంది సిద్ధమైపోయారు. మరి ఈ కొత్త ఏడాది జనవరిలో రాబోతున్న చిత్రాలేంటి? ముఖ్యంగా సంక్రాంతిని టార్గెట్ చేసుకొని వస్తున్న చిత్రాల పరిస్థితి ఏంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం .

జనవరి 1:

వనవీర:

వానర అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా.. సెన్సార్ నిర్ణయంతో వనవీరగా పేరు మార్చుకుంది . అవినాష్ తిరువీధుల నూతన పరిచయంలో రాబోతున్న ఈ చిత్రానికి ఈయనే దర్శకుడిగా కూడా పనిచేస్తున్నారు. యంగ్ బ్యూటీ సిమ్రాన్ చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రీనందు విలన్ పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఆమని, సత్య, కోన వెంకట్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా జనవరి 1న విడుదల కాబోతోంది.

సైక్ సిద్ధార్థ:

హీరో శ్రీ నందు హీరోగా వరుణ్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న సైకలాజికల్ రొమాంటిక్ కామెడీ చిత్రం సైక్ సిద్ధార్థ. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ జనవరి 1న విడుదలకు సిద్ధమవుతోంది.

ఫెయిల్యూర్ బాయ్స్

ఇట్స్ ఓకే గురు

నువ్వు నాకు నచ్చావ్

ఇక్కీస్

జనవరి 2:

వినరా ఓ వేమా

ఘంటశాల

నీలకంఠ

ఓ అందాల రాక్షసి

జగన్నాథ్

జనవరి 9

ది రాజా సాబ్:

మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా భారీ అంచనాల మధ్య రాబోతున్న చిత్రం ది రాజా సాబ్. మాళవిక మోహనన్ తొలిసారి తెలుగులో పరిచయం కాబోతున్న ఈ చిత్రంలో రిద్ది కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జనవరి 9న ఈ సినిమా విడుదల కానుంది.

జననాయకుడు:

జననాయగన్ అంటూ తమిళ్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా తెలుగులో డబ్బింగ్ వెర్షన్లో జననాయకుడు అంటూ జనవరి 9న రిలీజ్ చేయబోతున్నారు. హిందీలో జననేత అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తూ ఉండగా హెచ్ వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

జనవరి 12..

మన శంకర్ వరప్రసాద్ గారు:

సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది.

ఈ చిత్రంతోపాటు రుద్రకాళి సినిమా కూడా విడుదల కాబోతోంది.

జనవరి 13:

భర్త మహాశయులకు విజ్ఞప్తి:

మాస్ మహారాజ రవితేజ మాస్ జాతర సినిమాతో డిజాస్టర్ ను మూటగట్టుకున్నారు. ఇక ఇప్పుడు భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో జనవరి 13న సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి రాబోతున్నారు.

జనవరి 14:

పరాశక్తి : శివ కార్తికేయన్ హీరోగా శ్రీ లీలా హీరోయిన్ గా సుధా కొంగర దర్శకత్వంలో వస్తున్న చిత్రం పరాశక్తి. జనవరి 14న విడుదల కాబోతోంది.

అనగనగా ఒక రాజు:

నవీన్ పోలిశెట్టి హీరోగా వస్తున్న ఈ చిత్రం జనవరి 14న విడుదల కాబోతోంది.

జనవరి 30:

చైనా పీస్

యండమూరి కథలు

త్రిముఖ

ప్రభుత్వ సారాయి దుకాణం

ఈ చిత్రాలన్నీ కూడా జనవరిలో ప్రేక్షకులను థియేటర్లలో అలరించబోతున్నాయి.

Tags:    

Similar News