ఇద్దరు స్టార్స్ తో నిధి.. నెక్స్ట్ స్టెప్ ఏంటి..?
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నెక్స్ట్ సంక్రాంతికి రెబల్ స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్ సినిమాతో రాబోతుంది.;
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నెక్స్ట్ సంక్రాంతికి రెబల్ స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్ సినిమాతో రాబోతుంది. ఈ ఇయర్ ఆల్రెడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమాతో ప్రేక్షకులను అలరించింది అమ్మడు. పవన్ కళ్యాణ్ తో సినిమా నాలుగేళ్ల క్రితమే మొదలవగా అది ఈ ఇయర్ రిలీజైంది. అఫ్కోర్స్ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోలేదు. ఇక పవన్ కళ్యాణ్ తర్వాత ప్రభాస్ రాజా సాబ్ తో మరోసారి ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేయబోతుంది అమ్మడు. నిధి సినిమాలో ఉంటే గ్లామర్ పరంగా డౌట్ లేదన్నట్టే అని చెప్పొచ్చు.
నిధి మరోసారి తన సత్తా చాటాలని..
ఐతే వరుస రెండు సినిమాలు ఇద్దరు స్టార్స్ తో చేసిన నిధికి ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నది చర్చ నడుస్తుంది. హరి హర వీరమల్లు రిజల్ట్ డిజప్పాయింట్ చేసినా రాజా సాబ్ మీద మాత్రం అమ్మడు చాలా హోప్స్ పెట్టుకుంది. ఈ సినిమాతో నిధి మరోసారి తన సత్తా చాటాలని చూస్తుంది. సినిమాలో ప్రభాస్ కి జతగా పర్ఫెక్ట్ జోడీగా అనిపిస్తుంది అమ్మడు.
ప్రభాస్ రాజా సాబ్ లో నిధి తో పాటుగా మరో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా కూడా నిధి అగర్వాల్ మీదే ఆడియన్స్ ఫోకస్ ఉందని చెప్పొచ్చు. ఐతే రాజా సాబ్ తర్వాత అమ్మడి కెరీర్ నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది డిస్కషన్ నడుస్తుంది. ప్రస్తుతం అయితే అమ్మడికి తెలుగు ఆఫర్లు ఏమి రాలేదు. ఐతే ఇక మీదట తాను కూడా పాన్ ఇండియా సినిమాల్లోనే నటించాలని చూస్తుంది నిధి అగర్వాల్.
ప్రభాస్ సినిమాతో నేషనల్ వైడ్ గా..
ఎలాగు వీరమల్లు, రాజా సాబ్ సినిమాలతో పాన్ ఇండియా అటెంప్ట్ చేసింది కాబట్టి ఇక మీదట కూడా నేషనల్ వైడ్ రిలీజ్ చేసే సినిమాల మీదే ఎక్కువ ఫోకస్ చేయాలని అనుకుంటుంది. అలా అని రీజనల్ రిలీజ్ సినిమాలు చేయదా అంటే చేస్తుంది కానీ అమ్మడి ఫోకస్ అంతా పాన్ ఇండియా సినిమాలు, స్టార్ కాంబినేషన్స్ మీద ఉంది. ప్రభాస్ సినిమాతో నేషనల్ వైడ్ గా నిధి మరోసారి తన మీద ఫోకస్ ఉండేలా చేస్తుంది కాబట్టి ఆ సినిమా తర్వాత అమ్మడికి మరిన్ని క్రేజీ ఆఫర్స్ వస్తాయని చెప్పొచ్చు.
ఇస్మార్ట్ శంకర్ నుంచి తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఫ్యాన్స్ ని ఏర్పరచుకున్న నిధి అగర్వాల్ రాజా సాబ్ హిట్ తో మళ్లీ తన ఫాం కొనసాగించాలని చూస్తుంది. మరి అమ్మడికి ఈ సినిమా ఎలాంటి బూస్టింగ్ ఇస్తుందో చూడాలి. నిధి అగర్వాల్ మాత్రం కెరీర్ లో ఏమంత టేన్షన్ లేకుండా వచ్చిన సినిమాలే చేస్తా అన్నట్టు ఉంది. ఐతే పాన్ ఇండియా వైడ్ అమ్మడి ఫాలోయింగ్ పెంచుకునే క్రమంలో మొదటి ప్రిఫరెన్స్ మాత్రం స్టార్ సినిమాలను తన టీం తో చెబుతుందట అమ్మడు.