'మడ్డీ' టీజర్: భారతదేశపు ఫస్ట్ మడ్ రేస్ మూవీ దుమ్ములేపేలా ఉందిగా..!
భారతదేశపు మొట్టమొదటి ఆఫ్-రోడ్ మడ్ రేస్ చిత్రం ''మడ్డీ'' ని ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. డాక్టర్ ప్రగభల్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని పీకే7 క్రియేషన్స్ పతాకంపై ప్రేమ కృష్ణదాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. ఇటీవల 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి చేతుల మీదుగా విడుదలైన టైటిల్ లోగో మరియు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'మడ్డీ' టీజర్ ని బ్లాక్ బస్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు.
'మడ్డీ' టీజర్ చూస్తుంటే బురదలో సాగే రేసింగ్ తో సాహసోపేతమైన యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతోందని తెలుస్తోంది. రెండు వేర్వేరు జట్ల మధ్య శత్రుత్వం, ప్రతీకారం, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, థ్రిల్లర్, అడ్వెంచర్.. ఇలా అన్నీ కలబోసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు అర్థం అవుతోంది. నిజానికి మడ్ రేసింగ్ అనేది ఆఫ్-రోడ్ మోటర్ స్పోర్ట్ లో ఒక భాగం. ఈ నేపథ్యంలో వస్తున్న 'మడ్డీ' చిత్రాన్ని రియల్ లొకేషన్స్ లో రియల్ మడ్ రేసింగ్ ప్లేయర్స్ తో ఎంతో రియలిస్టిక్ గా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టీజర్ కి 'కేజీఎఫ్' ఫేమ్ రవి బస్రూర్ అందించిన నేపథ్య సంగీతం నెక్స్ట్ లెవల్ లో ఉంది. అలానే హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కె.జి రతీష్ అందించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. దీనికి శాన్ లోకేష్ ఎడిటింగ్ భాద్యతలు నిర్వహిస్తున్నారు.
'మడ్డీ' చిత్రంలో యువన్ - రిదాన్ కృష్ణ - అనూష సురేష్ - అమిత్ శివదాస్ నాయర్ - హరీష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆఫ్-రోడ్ రేసింగ్ క్రీడపై సినిమా తీయడం కోసం ఐదేళ్ల పాటు పరిశోధన చేసారని టీజర్ లో వెల్లడించారు. మట్టి రేసింగ్ కు ప్రాధాన్యత ఇస్తూ పూర్తిస్థాయి యాక్షన్ థ్రిల్లర్ రూపొందిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ''మడ్డీ'' చిత్రాన్ని త్వరలోనే పాన్ ఇండియా లెవల్ లో అనేక భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు.Full View
'మడ్డీ' టీజర్ చూస్తుంటే బురదలో సాగే రేసింగ్ తో సాహసోపేతమైన యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతోందని తెలుస్తోంది. రెండు వేర్వేరు జట్ల మధ్య శత్రుత్వం, ప్రతీకారం, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, థ్రిల్లర్, అడ్వెంచర్.. ఇలా అన్నీ కలబోసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు అర్థం అవుతోంది. నిజానికి మడ్ రేసింగ్ అనేది ఆఫ్-రోడ్ మోటర్ స్పోర్ట్ లో ఒక భాగం. ఈ నేపథ్యంలో వస్తున్న 'మడ్డీ' చిత్రాన్ని రియల్ లొకేషన్స్ లో రియల్ మడ్ రేసింగ్ ప్లేయర్స్ తో ఎంతో రియలిస్టిక్ గా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టీజర్ కి 'కేజీఎఫ్' ఫేమ్ రవి బస్రూర్ అందించిన నేపథ్య సంగీతం నెక్స్ట్ లెవల్ లో ఉంది. అలానే హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కె.జి రతీష్ అందించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. దీనికి శాన్ లోకేష్ ఎడిటింగ్ భాద్యతలు నిర్వహిస్తున్నారు.
'మడ్డీ' చిత్రంలో యువన్ - రిదాన్ కృష్ణ - అనూష సురేష్ - అమిత్ శివదాస్ నాయర్ - హరీష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆఫ్-రోడ్ రేసింగ్ క్రీడపై సినిమా తీయడం కోసం ఐదేళ్ల పాటు పరిశోధన చేసారని టీజర్ లో వెల్లడించారు. మట్టి రేసింగ్ కు ప్రాధాన్యత ఇస్తూ పూర్తిస్థాయి యాక్షన్ థ్రిల్లర్ రూపొందిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ''మడ్డీ'' చిత్రాన్ని త్వరలోనే పాన్ ఇండియా లెవల్ లో అనేక భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు.