ఇండియాని షేక్ చేసేలా ఆ నాలుగు చిత్రాల్లో రక్తపాతం!
పాన్ ఇండియాలో భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కి సక్సెస్ అయిన చిత్రాలు 'కేజీఎఫ్', 'సలార్', 'యానిమల్', 'ధురంధర్' గురించి ప్రత్యేకంగా చెప్పాలి.;
పాన్ ఇండియాలో భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కి సక్సెస్ అయిన చిత్రాలు 'కేజీఎఫ్', 'సలార్', 'యానిమల్', 'ధురంధర్' గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ నాలుగు సినిమాల్లో యాక్షన్ ప్రధానంగా హైలైట్ అయింది ఎవరి స్టైల్లో వారు యాక్షన్ డిజైన్ చేసిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 'కేజీఎఫ్', 'సలార్' లో ఓ రకమైన యాక్షన్ ఉంటే? 'యానిమల్', 'ధురంధర' చిత్రాల్లో మరో రకమైన యాక్షన్ హైలైట్ అయింది. వీటిలో మూడు సినిమాల్లో మూల కథ పాతదే అయినా? వారు డీల్ చేసిన విధానం కొత్తగా ఉంటుంది. కథా నేపథ్యం...ఎంచుకున్న పాత్రలు సినిమా సక్సెస్ లో పాత్ర పోషించాయి.
ప్రేక్షకులకు ఆ యాక్షన్ సన్నివేశాలు కొత్త అనుభూతిని అందించాయి. దర్శకుల ట్రీట్ మెంట్ కు ఫిదా అయ్యారు. అందుకే ఆ సినిమాలు అంత గొప్ప విజయాన్ని నమోదు చేసాయి. త్వరలోనే రిలీజ్ అవుతోన్న మరో నాలుగు పాన్ ఇండియా సినిమాలపై అంచనాలు అంతకు మించే ఉన్నాయి. వాటి వివరాల్లోకి వెళ్తే.. యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ 'టాక్సిక్' అనే భారీ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే రిలీజ్ అయిన టీజర్ స్టైలిష్ గా కనెక్ట్ అయింది. ఇందులో యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుంది? అన్నది టీజర్ చెప్పకనే చెప్పింది.
కారులో ఘాటైన రొమాన్స్ -గన్ ఫైరింగ్ డిజైన్ చేసిన తీరు ఎంతో కొత్తగా ఉంది. మేకింగ్ లో హాలీవుడ్ మేకర్ నే తలపించింది. చిన్న టీజర్ లోనే యాక్షన్ సీన్ తో అదర గొట్టింది. అసలైన బ్లడ్ షెడ్ ఎలా ఉంటుంది? అన్నది మూడు గంటల సినిమాలో చూపించబోతున్నారు. అలాగే నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదలో 'ది ప్యారడైజ్' తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ మద్య రిలీజ్ అయిన గ్లింప్స్ తో ఈ సినిమాలోనే రక్తపాతం మామూలుగా ఉండదని అర్దమైంది. ఇందులో నాని జడల్ అనే పాత్ర పోషిస్తున్నాడు.
ఆ పాత్ర ఆహార్యం ఎంతో ఆకట్టుకుంటుంది. నాని నుంచి ఓ డిఫరెంట్ యాక్షన్ సినిమాను ఆస్వాదించొచ్చు అనేలా ఉంది. ఆ పాత్రను చాలా మాసివ్ గా డిజైన్ చేసాడు. టీజర్ , ట్రైలర్ తో హింస ఏ రేంజ్ లో ఉంటుంది? అన్నది ఓ క్లారిటీ వచ్చేస్తుంది. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. 'కేజీఎఫ్', 'సలార్' యాక్షన్ మించి ఎన్టీఆర్ సినిమాలో యాక్షన్ హైలైట్ అవుతుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.
ఈ విషయంలో యంగ్ టైగర్ అభిమానులు ఎంతో కాన్పిడెంట్ గా ఉన్నారు. 1960ల నాటి మయన్మార్ , థాయిలాండ్ , లావోస్ సరిహద్దు ప్రాంతమైన గోల్డెన్ ట్రయాంగిల్ నేపథ్యంలో కథ సాగుతుంది. ఇందులో తారక్ అత్యంత శక్తివంతమైన, క్రూరమైన మాఫియా డాన్ పాత్రలో కనిపిస్తాడని సమాచారం. ఒక సాధారణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎలా ఎదిగింది అనేది ఈ కథలోని ప్రధానాంశం. అలాగే 'ధురంధర్ పార్ట్ 2' ది రివేంజ్ గా రిలీజ్ అవుతుంది. మొదటి భాగంలో హింసను పతాక స్థాయిలో చూపించాడు ఆధిత్యధర్. దీంతో రివేంజ్ లో అదే హింస నెక్స్ట్ లెవల్లో ఉంటుందని ముందే చెప్పేసారు. `ఏ` సర్టిఫికెట్ తోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది.