ఫోటో స్టోరి: థై స్లిట్ దుస్తుల్లో దిశా పటానీ ధగధగలు
బాలీవుడ్ గ్లామర్ క్వీన్ దిశా పటానీ తన అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. దిశా నటించిన భారీ మల్టీస్టారర్ చిత్రం `వెల్‌కమ్ టు ది జంగిల్` ట్రైలర్ లాంచ్ వేడుకలో దిశా సరికొత్త లుక్‌తో మెరిసిపోయింది.
బాలీవుడ్ గ్లామర్ క్వీన్ దిశా పటానీ తన అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. దిశా నటించిన భారీ మల్టీస్టారర్ చిత్రం `వెల్‌కమ్ టు ది జంగిల్` ట్రైలర్ లాంచ్ వేడుకలో దిశా సరికొత్త లుక్‌తో మెరిసిపోయింది. ఈ వేడుక కోసం లైమ్-గ్రీన్ (నిమ్మ రంగు) డ్రెస్ ధరించి సమ్మర్ వైబ్‌ను ప్రతిబింబిస్తూ అందరినీ మంత్రముగ్ధులను చేసింది.
ఈ వేడుకలో దిశా పటానీ `జేడెడ్ లండన్` బ్రాండ్‌కు చెందిన గ్లామరస్ డ్రెస్‌లో ధగధగలాడిపోయింది. బాడీ హగ్గింగ్ సిల్హౌట్‌తో ఉన్న ఈ దుస్తులకు నడుము భాగంలో ఉన్న కట్-అవుట్స్, థై-హై స్లిట్ (తొడల వరకు ఉన్న కట్) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దుస్తులంతటా ఉన్న మెరుపులు, నడుము భాగంలో ఉన్న మెష్ డిజైన్ దిశా లుక్‌కు మరింత డ్రామాను, బోల్డ్ గ్రేస్‌ను జోడించాయి. అలాగే స్పాగెట్టి స్ట్రాప్స్, స్కూప్ నెక్ లైన్ ఈ బోల్డ్ దుస్తులకు కాస్త సున్నితమైన స్పర్శను అందించాయి.
ఈ బ్రైట్ గ్రీన్ కలర్ డ్రెస్ అందాన్ని మరింత ఎలివేట్ చేయడం కోసం దిశా తన యాక్సెసరీస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. కేవలం బంగారు వర్ణపు బ్రాస్‌లెట్స్‌తో తన లుక్‌ను సింపుల్‌గా ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. మెరిసే లైమ్-గ్రీన్ దుస్తులే వేడుకలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచేలా దిశా ప్లానింగ్ సూపర్భ్. 33 ఏళ్ల ఈ సోయగం తన స్టైలింగ్‌తో ఫ్రెష్‌నెస్‌ను.. ఇటు నైట్ పార్టీకి సరిపడే గ్లామర్‌ను సమంగా పండించింది. ఓవరాల్‌గా ఈ లుక్ ఫ్యాషన్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
దిశా పటానీ లుక్ నుండి ఫ్యాషన్ లవర్స్ నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. సాధారణంగా కాక్‌టెయిల్ లేదా ఈవెనింగ్ పార్టీలు అనగానే చాలామంది నలుపు లేదా న్యూట్రల్ రంగులకే ప్రాధాన్యత ఇస్తారు. కానీ దిశా మాత్రం బ్రైట్ కలర్స్ కూడా ఈవెనింగ్ వేర్‌కు ఎంత పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతాయో నిరూపించింది. దుస్తులు అంత బోల్డ్‌గా ఉన్నప్పుడు మేకప్, యాక్సెసరీస్, హెయిర్‌స్టైల్‌ను ఎంత సింపుల్‌గా ఉంచితే అంత అందంగా కనిపిస్తామనే ఫ్యాషన్ రూల్‌ను చక్కగా అప్లై చేసింది. ప్రస్తుతం ఈ స్పెషల్ లుక్ ఇంటర్నెట్ లో విపరీతంగా వైరల్ అవుతోంది.
దిశా పటానీ నటించిన వెల్‌కం టు ది జంగిల్ (వెల్ కం 3) త్వరలో విడుదలకు రానున్న సంగతి తెలిసిందే. ఇందులో అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్, లారా దత్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కి అద్భుత స్పందన వచ్చింది. ఈ ట్రైలర్ లో ఏకైక యంగ్ గ్లామ్ డాళ్ దిశా పటానీ. తన అందంతో ఊరిస్తూ ట్రైలర్ లో హీట్ పెంచింది.