ట్రైలర్ టాక్: లిప్ లాక్ లు బెడ్ రూమ్ ఆవిరులేనా
లిప్ లాక్ లు.. బెడ్ రూమ్ సన్నివేశాలకు ఉండే గిరాకీనే వేరు. రూమ్ లో ఆవిరులు పుట్టాలంతే. లవ్ రొమాన్స్ పేరుతో వేడెక్కించే సన్నివేశాలని స్వేచ్ఛగా తెరకెక్కించే వీలుంటే ఇక ఆ మూవీ ఆడే థియేటర్ లో అరుపులే. ఇటీవల బూతు కంటెంట్ పెచ్చురిల్లుతోంది! అన్న బెంగ ఏమాత్రం మన మేకర్స్ లో కనిపించడం లేదు. ఇకపోతే మరీ అంత టూమచ్ గా ఏం లేదు కానీ.. కాస్త హద్దు మీరి మాత్రమే కనిపిస్తోంది ఈ మూవీలో రొమాన్స్. వరుస లిప్ లాక్ లు.. బెడ్ రూమ్ సన్నివేశాలతో అగ్గి రాజేసింది. 4కె ట్రైలర్ ఆద్యంతం మంటలు పెట్టేసింది.
`మిస్టర్ అండ్ మిస్` టైటిల్ కి తగ్గట్టే మిస్టర్ తో మిస్ రొమాన్స్ పీక్స్ అనే చెప్పాలి. ఇక ఇందులో చెప్పాలనుకున్న సందేశం నేటి యువతరానికి కచ్ఛితంగా తెలిసి తీరాల్సినదే. ప్రియుడే కదా అని శృంగారానికి అలవాటు పడి అటుపై దానిని ఫోన్లలో చిత్రీకరించి సరదా తీర్చుకున్నాక కంగారు పడిపోయే టెంప్టింగ్ యూత్ కి చాలానే చెప్పాలని చూస్తున్నారనిపించింది. సెల్ ఫోన్లలో సెల్ఫీలు.. వీడియోలు.. ఫోటోలు తీసి అటుపై ఆ ఫోన్ పోగొట్టుకుంటే ఏమవుతుంది? అది కూడా బెడ్ రూమ్ శృంగారాన్ని పెళ్లికాని అమ్మాయి తనకు తానుగానే ఫోన్ లో చిత్రీకరిస్తే ఇంకేమైనా ఉందా? ఇంట్రెస్టింగ్ పాయింట్ నే టచ్ చేసారు.
శైలేశ్- జ్ఞానేశ్వరి నాయకానాయికలుగా దర్శకుడు అశోక్ రెడ్డి తెరకెక్కించిన యూత్ ఫుల్ అండ్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ చిత్రమిది. కొత్తవారితో క్రౌడ్ ఫండెడ్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో విడుదల కానుంది. టీజర్.. ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఘాడమైన ప్రేమ.. మనస్పర్థలు బ్రేక్ అప్ తో పాటు చక్కని సందేశం ఉన్న చిత్రాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
Full View