'గుంటూరు మిర్చి' ఘాటు చూపించిన బిబి మెహబూబ్
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 తో మంచి గుర్తింపు దక్కించుకున్న కంటెస్టెంట్స్ లో మెహబూబ్ దిల్ సే ఒకరు. యూట్యూబ్ స్టార్ గా అంతకు ముందు కొద్ది మందికి తెలిసిన మెహబూబ్ బిగ్ బాస్ లో డాన్స్ లతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా సోహెల్ మరియు మెహబూబ్ ల స్నేహం.. వారిద్దరి మద్య జరిగే సంఘటనలు సన్నివేశాలు సంభాషణలు అన్ని కూడా ప్రేక్షకులను అలరించాయి. ఓట్లు వచ్చినా కూడా మెహబూబ్ ను ఒకరి కోసం ఎలిమినేట్ చేశారంటూ ప్రేక్షకులు ఆ సమయంలో బిగ్ బాస్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షో ఫినాలే రోజున చిరంజీవి నుండి మెహబూబ్ కు దక్కిన ప్రశంసలతో ఆయన స్థాయి మరింతగా పెరిగింది.
మెగా స్టార్ చిరంజీవి స్వయంగా నీ డాన్స్ బాగుంది అంటూ మెహబూబ్ కు కితాబివ్వడంతో పాటు అభినందనలు తెలియజేశారు. బిగ్ బాస్ తర్వాత మెహబూబ్ చాలా బిజీ అయ్యాడు. సినిమాల్లో వరుసగా నటిస్తూ వస్తున్నాడు. తాజాగా హీరోగా గుంటూరు మిర్చి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. మాస్ మసాలా ఎలిమెంట్స్ తో మెహబూబ్ ను ఈ సినిమాలో దర్శకుడు అనిల్ విశ్వనాథ్ చూపించబోతున్నట్లుగా తాజాగా విడుదల అయిన టీజర్ తో అనిపిస్తుంది.
మెహబూబ్ లోని మాస్ యాంగిల్ తో పాటు అతడి నటన ప్రతిభను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నాడు. టీజర్ సాయి కుమార్ వాయిస్ ఓవర్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇద్దరు హీరోయిన్స్ తో ఈ సినిమాలో మెహబూబ్ రొమాన్స్ చేయబోతున్నాడు. పల్లె వాతావరణంలో రూపొందిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందనే నమ్మకంను టీజర్ కలుగ జేస్తుంది. మెహబూబ్ ఈ సినిమా తో హీరోగా బిజీ అవుతాడా.. గుంటూరు మిర్చి తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుందా చూడాలి.
Full View