జాక్ పాట్ కొట్టిన డ్యూడ్ హీరో..

ముఖ్యంగా ప్రదీప్ రంగనాథన్ కి ఈ సినిమా కమర్షియల్ గా అతిపెద్ద విజయాన్ని అందించిందని చెప్పవచ్చు. అలాంటి ఈ హీరో ఇప్పుడు జాక్ పాట్ కొట్టారు.;

Update: 2026-01-17 06:30 GMT

ప్రముఖ కోలీవుడ్ యంగ్ హీరోగా, దర్శకుడిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రదీప్ రంగనాథన్ చివరిగా నటించిన చిత్రం డ్యూడ్. ఈ చిత్రానికి కీర్తిస్వరణ్ దర్శకత్వం వహించారు. మమితా బైజు ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాలో ఐశ్వర్య శర్మ , నేహా శెట్టి, ఆర్.శరత్ కుమార్, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ప్రదీప్ రంగనాథన్ కి ఈ సినిమా కమర్షియల్ గా అతిపెద్ద విజయాన్ని అందించిందని చెప్పవచ్చు. అలాంటి ఈ హీరో ఇప్పుడు జాక్ పాట్ కొట్టారు. ఏకంగా ఇద్దరు స్టార్ హీరోయిన్లతో సినిమా చేయబోతున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే.. ఇప్పటికే డ్రాగన్, లవ్ టుడే, డ్యూడ్ చిత్రాలతో మంచి విజయాలను అందుకున్న ఈయన తన తదుపరి చిత్రాన్ని ఈ ఏడాది ప్రారంభించడానికి సిద్ధం అయ్యారు. అందులో భాగంగానే డ్రాగన్ సినిమా నిర్మాతలు ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు ప్రదీప్ తో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఇందులో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించడమే కాకుండా.. ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహించనున్నారు.. సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైన్మెంట్ గా రాబోతున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నట్లు సమాచారం.

ఇకపోతే ఈసారి ప్రదీప్ తో ఏకంగా ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. ఈ ఇద్దరు హీరోయిన్లు కూడా క్రేజీ హీరోయిన్లు కావడంతో ప్రదీప్ రంగనాథన్ అదృష్టం మామూలుగా లేదుగా అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. విషయంలోకి వెళ్తే ఈసారి కూడా సంక్రాంతి బరిలో నిలిచి సక్సెస్ అందుకొని సంక్రాంతికి హ్యాట్రిక్ కొట్టిన మీనాక్షి చౌదరితో పాటు ఈ ఏడాది శివ కార్తికేయన్ హీరోగా నటించిన పరాశక్తి సినిమాతో తొలిసారి కోలీవుడ్ రంగ ప్రవేశం చేసిన శ్రీ లీల ఈ సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం.

ఇప్పటికే వీరిద్దరితో ఏజిఎస్ నిర్మాతలు చర్చలు జరిపారని, వారు కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.ఇకపోతే ఇప్పటివరకు చిన్న హీరోయిన్లతో సినిమా చేసిన ప్రదీప్ రంగనాథన్ తొలిసారి ఇద్దరు స్టార్ హీరోయిన్లతో కలసి పనిచేయబోతున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పైగా ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రం కోసం భారీ బడ్జెట్ కేటాయిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెలువడనున్నాయి.

ప్రదీప్ రంగనాథన్ విషయానికి వస్తే.. దర్శకుడిగా, నేపథ్య గాయకుడిగా , గీతా రచయితగా, స్క్రీన్ రైటర్గా పేరు దక్కించుకున్న ప్రదీప్ రంగనాథన్ తమిళ సినిమాలలో పనిచేస్తూ భారీ పాపులారిటీ అందుకున్నారు .SSN కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసి వాట్సప్ కాదల్ తో సహా అనేక షార్ట్ ఫిలిమ్స్ తీసి తన కెరీర్ ను ప్రారంభించారు. ముఖ్యంగా నటన, ఎడిటింగ్ మాత్రమే కాదు దర్శకత్వం చేస్తూ ఇండస్ట్రీలోకి రాకముందే మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా పేరు దక్కించుకున్నారు.

Tags:    

Similar News