తొలి రీజనల్ మూవీగా MSG.. ఐదు రోజులు లెక్క ఎంతంటే?
ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పిస్తోంది. రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లోనూ భారీ వసూళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి.;
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఆ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రమోషన్స్ టైమ్ లో భారీ అంచనాలు క్రియేట్ చేసిన మూవీ.. వాటిని అందుకుని ఇప్పుడు థియేటర్స్ లో సందడి చేస్తోంది.
ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పిస్తోంది. రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లోనూ భారీ వసూళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. వీకెండ్ కావడంతో నేడు, రేపు ఇంకా మంచి వసూళ్లు రానున్నాయి. బుక్ మై షోలో అయితే మన శంకర వరప్రసాద్ డామినేషన్ చూపిస్తోంది. ఇప్పటి వరకు ఆ సినిమాకు 2.5 మిలియన్ల టికెట్లు అమ్ముడవడం గమనార్హం.
అయితే మేకర్స్ విడుదల చేస్తున్న లెక్కల ప్రకారం.. మన శంకర వరప్రసాద్ గారు మూవీ మొదటి రోజు రూ. 84 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఆ తర్వాత మూడో రోజుకు రూ. 150 కోట్ల క్లబ్, ఇక 4 రోజుల్లోనే రూ. 200 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకుంది. ఇప్పుడు ఐదు రోజులు వసూళ్ల లెక్కలను మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. రూ.226 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు తెలిపారు.
ఒక రీజినల్ మూవీకి ఇది ఆల్ టైమ్ రికార్డు అని చెప్పారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. "మన శంకర వరప్రసాద్ గారు ప్రతి చోట డామినేట్ చేస్తూ దూసుకుపోతోంది. మెగా సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన MSG 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.226 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఒక రీజినల్ మూవీకి ఇది ఆల్ టైమ్ రికార్డ్. సెన్సేషన్ వీకెండ్ అంతా MSGదే" అని రాసుకొచ్చారు.
అదే సమయంలో మన శంకర వరప్రసాద్ గారు మూవీ రూ.250 కోట్ల బడ్జెట్ తో రూపొందినట్లు తెలుస్తోంది. విడుదలకు ముందే..వరల్డ్ వైడ్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.140-150 కోట్ల మధ్య జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. బ్రేక్ ఈవెన్ కోసం రూ.280-3 00 కోట్ల గ్రాస్ అవసరమని చెప్పాయి. కానీ మేకర్స్ మాత్రం ఇప్పటికే రూ.226 కోట్లకు పైగా ఇప్పటికే వసూలు చేసినట్లు వెల్లడించారు.
ఇక సినిమా విషయానికొస్తే.. చిరంజీవి సరసన సీనియర్ బ్యూటీ నయనతార హీరోయిన్ గా యాక్ట్ చేశారు. విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషించారు. వీటీవీ గణేష్, యూట్యూబర్ నందన సహా అనేక మంది నటించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.