2027: బరిలోకి దర్శక దిగ్గజాలు.. ఇదికదా అసలైన పోటీ!

సినీ ఇండస్ట్రీలో బడా దిగ్గజాలుగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు.. ఒక ఏడాది ఒక సినిమాతో వస్తున్నారంటేనే.. ఆ ఏడాది పొడవునా ఆ సినిమా కోసం అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు కూడా ఎంతగా ఎదురు చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.;

Update: 2026-01-17 06:11 GMT

సినీ ఇండస్ట్రీలో బడా దిగ్గజాలుగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు.. ఒక ఏడాది ఒక సినిమాతో వస్తున్నారంటేనే.. ఆ ఏడాది పొడవునా ఆ సినిమా కోసం అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు కూడా ఎంతగా ఎదురు చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది ఒకే ఏడాది దిగ్గజ దర్శకులుగా పేరు తెచ్చుకున్న నలుగురు.. ఏకంగా నలుగురు స్టార్ హీరోలతో థియేటర్ల ముందుకు వస్తున్నారు అంటే ఇక ఆ హడావిడి ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే అని చెప్పాలి.

ఈ క్రమంలోనే ఏకంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బడా డైరెక్టర్లుగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి, ప్రశాంత్ నీల్ , సందీప్ రెడ్డివంగా, లోకేష్ కనగరాజు.. ఇలా నలుగురు కూడా వచ్చే ఏడాది తమ సినిమాలతో పోటీకి సిద్ధమవుతున్నారు. పైగా వీరంతా బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఇవ్వనున్నారు. ఇక వచ్చే ఏడాది ఎవరి సత్తా ఏ రేంజ్ లో ఉందో తెలుసుకోవడానికి అటు అభిమానులే కాదు ఇటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. మరి ఏ డైరెక్టర్ ఏ హీరోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారో ఇప్పుడు చూద్దాం..

రాజమౌళి - మహేష్ బాబు :

ఇండియన్ ప్రేక్షకుడే కాదు యావత్ అంతర్జాతీయ స్థాయిలో సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం వారణాసి. ఆఫ్రికన్ అడ్వెంచర్ అడవుల నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోగా, గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ముఖ్యంగా మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే వీరి పాత్రలను కూడా రాజమౌళి రివీల్ చేశారు. దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ సుమారుగా 1200 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సందీప్ రెడ్డి వంగ -ప్రభాస్

పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలన దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న చిత్రం స్పిరిట్. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పైగా ప్రభాస్ ను మునుపెన్నడూ చూడని లుక్ ల్లో సందీప్ ఫస్ట్ లుక్ ద్వారా రివీల్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు. దీనికి తోడు ఈ సినిమాలో తొలిసారి ప్రభాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 5వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు సంక్రాంతి స్పెషల్ గా సందీప్ రెడ్డివంగా అధికారిక పోస్టర్ తో స్పష్టం చేశారు. ఈ సినిమాలో తృప్తి డిమ్రి హీరోయిన్గా నటిస్తోంది.

ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ :

కేజీఎఫ్ 1,2 చిత్రాలతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం డ్రాగన్. ప్రస్తుతం టైటిల్ ప్రకటించకపోయినా దాదాపు ఇదే టైటిల్ ఫిక్స్ చేస్తారు అనే వార్తలు కూడా ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్నాయి.. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది.

లోకేష్ కనగరాజు - అల్లు అర్జున్ :

అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా హాలీవుడ్ మూవీ ప్రమాణాలతో తెరకెక్కుతోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. అయితే ఈ సినిమా కూడా వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఇలా మొత్తానికైతే నలుగురు బడా హీరోలతో నలుగురు స్టార్ దర్శక దిగ్గజాలు రంగంలోకి దిగుతున్నారు. మరి ఏ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ తో మిగతా సినిమాలను డామినేట్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News