సేతుపతి సైలెంట్ గానే మెప్పించేట్టున్నాడుగా!
అయితే అదే రోజున విజయ్ సేతుపతి పుట్టిన రోజుని పురస్కరించుకుని ఆయన నటించిన మరో మూవీని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ టీజర్ ను రిలీజ్ చేశారు.;
సౌత్ లోని బెస్ట్ యాక్టర్లలో విజయ్ సేతుపతి కూడా ఒకరు. కోలీవుడ్ నటుడిగా జర్నీని మొదలుపెట్టిన విజయ్ సేతుపతి తర్వాత వేరే భాషల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి అన్నీ భాషల్లోనూ ఆకట్టుకున్నారు. పిజ్జా మూవీతో కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆయన ఎన్నో గొప్ప సినిమాలతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న విజయ్ సేతుపతి తెలుగులో కూడా పలు సినిమాలు చేస్తూ తన నటనతో ఆడియన్స్ ను ఫిదా చేశారు.
స్లమ్ డాగ్ ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్
ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తున్న విజయ్ సేతుపతి కెరీర్ లో చాలా బిజీగా ఉన్నారు. వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉండే ఆయన తెలుగులో డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో స్లమ్ డాగ్ అనే సినిమాను చేస్తుండగా, త్వరలోనే ఆ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి సేతుపతి బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా, ఆ లుక్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
సేతుపతి బర్త్ డే సందర్భంగా రిలీజైన గాంధీ టాక్స్ టీజర్
అయితే అదే రోజున విజయ్ సేతుపతి పుట్టిన రోజుని పురస్కరించుకుని ఆయన నటించిన మరో మూవీని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ టీజర్ ను రిలీజ్ చేశారు. అదే గాంధీ టాక్స్. అయితే ఈ మూవీ సైలెంట్ సినిమా అవడం విశేషం. సైలెంట్ మూవీ ఎరాను మళ్లీ వెనక్కి తీసుకొస్తున్నామని చిత్ర యూనిట్ అందరినీ టీజర్ లో ఎగ్జైట్ చేసింది. ఈ సినిమాలో క్యాస్టింగ్ కూడా భారీగానే ఉంది.
భారీ క్యాస్టింగ్ తో వస్తోన్న గాంధీ టాక్స్
గాంధీ టాక్స్ లో అరవింద్ స్వామి, అదితిరావు హైదరి లాంటి క్యాస్టింగ్ నటించడం సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. సినిమా టైటిల్ కు తగ్గట్టే ఇది గాంధీ చుట్టూ తిరిగే కథ అని టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. గాంధీని మనం రెగ్యులర్ గా చూసే కరెన్సీ తో ఏమేం పనులు జరుగుతాయనేది సినిమాలో చూపించబోతున్నట్టున్నారు. సినిమాలోని పాత్రలు మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నా, డబ్బు మాట్లాడుతుందనేది డైరెక్టర్ ఆంతర్యం అయ్యుండొచ్చు.
టీజర్ మొత్తంలో ఎక్కువగా గాంధీ ఉన్న షాట్స్ తీసి, వాటినే టీజర్లో చూపించగా, సినిమాలో సేతుపతి చాలా ఇంట్రెస్టింగ్ రోల్ ను ప్లే చేసినట్టు తెలుస్తోంది. కిషోర్ పాండురంగ్ బెలేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను రాజేష్ కేజ్రీవాల్, మీరా చోప్రా నిర్మించగా, ఏ ఆర్ రెహమాన్ గాంధీ టాక్స్ కు సంగీతం అందిస్తున్నారు. సైలెంట్ మూవీ కావడంతో ఈ సినిమాకు రెహమాన్ సంగీతమే ఎక్కువగా మాట్లాడుతుందనుకోవచ్చు. జనవరి 30న గాంధీ టాక్స్ రిలీజ్ కానుంది.