తారక్ కి అదంటే పిచ్చి.. రివీల్ చేసిన రామ్ చరణ్!
ఇకపోతే అలా టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న వారిలో రామ్ చరణ్ - ఎన్టీఆర్ కూడా ఒకరు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి వీరి స్నేహబంధాన్ని మరింత బలపరుచుకున్నారు.;
సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు హీరోల మధ్య మంచి అవినాభావ సంబంధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అభిమానులు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని సోషల్ మీడియాలో వాదులాడుకుంటారు కానీ సెలబ్రిటీలు మాత్రం మంచి స్నేహితులుగా ఉండడమే కాకుండా ఏదైనా అకేషన్ ఉంటే మాత్రం కలసి సందడి చేస్తూ ఉంటారు. అంతేకాదు బెస్ట్ ఫ్రెండ్స్ గా చలామణి అవడమే కాకుండా తమ స్నేహితులకు సంబంధించిన పలు విషయాలను బయట పెడుతూ అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.. ఈ క్రమంలోనే ఇప్పటికే టాలీవుడ్ లో ప్రభాస్ - గోపీచంద్ , రామ్ చరణ్ - శర్వానంద్ లాంటి బెస్ట్ హీరోలు ఎప్పటికప్పుడు తమ స్నేహితులకు సంబంధించిన పలు విషయాలను బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే.
ఇకపోతే అలా టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న వారిలో రామ్ చరణ్ - ఎన్టీఆర్ కూడా ఒకరు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి వీరి స్నేహబంధాన్ని మరింత బలపరుచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ కి అదంటే పిచ్చి అని.. ఎన్టీఆర్ ఉంటే తనకు ఎక్కడలేని భరోసా కలుగుతుంది అంటూ చెప్పి ఎన్టీఆర్ అభిమానులను కూడా సర్ప్రైజ్ చేశారు రామ్ చరణ్..
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ తో.." మీకు ఒక పర్సనల్ కారు ఇస్తే.. ఏ కోస్టార్ తో డ్రైవ్ లో మీరు ప్యాసింజర్ సీట్లో కూర్చుంటారు?" అని అడగగా రామ్ చరణ్ ఎన్టీఆర్ పేరు చెప్పడం విశేషం అనే చెప్పాలి. దీనిపై రామ్ చరణ్ మాట్లాడుతూ.. "తారక్ అంటేనే ఒక క్రేజీ, మ్యాడ్ డ్రైవర్. తారక్ కారు నడుపుతుంటే పక్క సీట్లో కూర్చున్న స్నేహితులు తమకు ఎదురైన వింత , ఉత్కంఠభరిత అనుభవాల గురించి నాతో పంచుకున్నారు. ఇక అందరిలోనూ తారక్ డ్రైవింగ్ లోనే నేను సురక్షితంగా ఉన్నట్లు భావిస్తాను" అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ గురించి రాంచరణ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
రామ్ చరణ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇక మిగిలిన కొంత భాగాన్ని త్వరలోనే పూర్తి చేయబోతున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం నుండి విడుదలైన చికిరి చికిరి పాట అతి తక్కువ సమయంలోనే అన్ని భాషలు కలుపుకొని 200 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది.. ఇక మహాశివరాత్రి సందర్భంగా రెండవ పాడిన విడుదల చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి ఆస్కార్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సీక్వెల్ లో రామ్ చరణ్ నటించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రాజెక్టు పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.