బెంగళూరులో మహేష్ కొత్త థియేటర్.. తొలి ప్రదర్శన ఆ హీరోదే!

ఈ మేరకు మహేష్ బాబు ఒక ట్వీట్ చేస్తూ.." జనవరి 16న బెంగళూరులో ఏఎంబి సినిమాస్ తలుపులు అధికారికంగా తెరుచుకోనున్నాయి.;

Update: 2026-01-17 05:46 GMT

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సినిమాలు చేసి సూపర్ స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు మహేష్ బాబు.. అలాంటి ఈయన ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆఫ్రికన్ అడ్వెంచర్ డ్రామాగా పాన్ వరల్డ్ మూవీ వారణాసితో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అలా ఒకవైపు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే.. మరొకవైపు పలు యాడ్స్, బిజినెస్ అంటూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇకపోతే ఇప్పటికే ఏషియన్ మూవీస్ తో కలిసి మహేష్ బాబు నిర్మించిన "ఏఎంబి సినిమాస్" మల్టీప్లెక్స్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాదులో నంబర్ వన్ మల్టీప్లెక్స్ థియేటర్ గా పేరు దక్కించుకుంది. ముఖ్యంగా కంటెంట్ తో సంబంధం లేకుండా సినిమా విడుదలవుతోంది అంటే చాలు టికెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈ థియేటర్ లగ్జరీ బెనిఫిట్స్ ను అనుభవించడానికి ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఆసక్తి కనబరుస్తున్నారో అర్థం చేసుకోవచ్చు..

దీనికి తోడు హైదరాబాదులోనే మహేష్ ఏషియన్ భాగస్వామ్యంలో మరో మల్టీప్లెక్స్ కూడా త్వరలో రాబోతోంది. ఇకపోతే తెలంగాణలోనే కాకుండా అటు కర్ణాటకలో కూడా మహేష్ ఏషియన్ వారి మల్టీప్లెక్స్ అందుబాటులోకి వచ్చింది. బెంగళూరులో "ఏఎంబీ లగ్జ్" పేరిట జనవరి 16వ తేదీన అధికారికంగా ప్రారంభించారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని మొట్టమొదటి డాల్బీ సినిమా ఎక్స్పీరియన్స్ ను ఈ మల్టీప్లెక్స్ అందించనుంది అని అటు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు కూడా..

ఈ మేరకు మహేష్ బాబు ఒక ట్వీట్ చేస్తూ.." జనవరి 16న బెంగళూరులో ఏఎంబి సినిమాస్ తలుపులు అధికారికంగా తెరుచుకోనున్నాయి. సౌత్ ఇండియాలోనే తొలి డాల్బీ సినిమా అనుభూతిని ఇక్కడ మీకు అందించబోతున్నాము. అసాధారణమైన కృషి చేసిన టీం ఏఎంబి కి నా అభినందనలు. త్వరలో నమ్మ బెంగళూరులో అందరినీ కలుస్తాను" అంటూ మహేష్ బాబు పోస్ట్ కూడా చేశారు..

అందులో భాగంగానే బెంగళూరులో ప్రపంచ స్థాయి సినిమా వీక్షణ అనుభూతి కోసం ఈ థియేటర్ ను ప్రారంభించారు. ఇక ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇక్కడ ప్రదర్శితమైన తొలి చిత్రం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన "మన శంకర వరప్రసాద్ గారు" కావడం విశేషం. మొత్తానికైతే మెగాస్టార్ చిరంజీవి తొలి సినిమాతో బెంగళూరులో మహేష్ బాబు కొత్త మల్టీప్లెక్స్ ప్రారంభం అయింది.

ఈ కొత్త ఏఎంబి లగ్జ్ మల్టీప్లెక్స్ ప్రత్యేకతల విషయానికి వస్తే.. 500కు పైగా సీటింగ్ సామర్థ్యం తో పాటు భారీ డాల్బీ సినిమా స్క్రీన్ ను అమర్చారు. హై క్లాస్ లగ్జరీ థియేటర్ గా దీనిని రూపుదిద్దడమే కాకుండా 65 అడుగులతో భారీగా స్క్రీన్ ను నిర్మించారు. భారీ స్క్రీన్, సూపర్ క్లారిటీ, అదిరిపోయే సౌండ్ సిస్టంతో ఈ థియేటర్ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని పంచుతోంది. ఐమాక్స్ థియేటర్లకు దీటుగా నిలుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పైగా బెంగళూరులో ప్రారంభమైన ఈ థియేటర్ త్వరలో మహేష్ బాబు కూడా సందర్శించబోతున్నట్లు సమాచారం.

Tags:    

Similar News