మృణాల్ ఆ ఏడుగురి త‌రువాతే ధ‌నుష్?

కోలీవుడ్ స్టార్ ధ‌నుష్‌తో మృణాల్ గ‌త కొంత కాలంగా ప్రేమ‌లో ఉంద‌ని, వీరిద్ద‌రూ త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్త‌లు షికారు చేస్తున్న విష‌యం తెలిసిందే.;

Update: 2026-01-17 08:06 GMT

టెలివిజ‌న్ స్టార్‌గా కెరీర్ ప్రారంభించిన మ‌రాఠా సుంద‌రి మృణాల్ ఠాకూర్.. ఏక్తా క‌పూర్ నిర్మించిన `కుంకుమ్ భాగ్య‌` సీరియ‌ల్‌తో పాపులారిటీని సొంతం చేసుకుంది. మ‌రాఠీ ఫిల్మ్ `హ‌లో నంద‌న్‌`తో హీరోయిన్‌గా సినిమాల్లోకి అరంగేట్రం చేసింది. హృతిక్‌రోష‌న్ `సూప‌ర్ 30`తో బాలీవుడ్ మేక‌ర్స్‌తో పాటు ద‌క్షిణాది మేక‌ర్స్‌ దృష్టిని ఆక‌ర్షించింది. `సీతారామం`తో టాలీవుడ్ ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించి తొలి ప్ర‌య‌త్నంలోనే బ్లాక్ బ‌స్ట‌ర్ క్లాసిక్ హిట్‌ని సొంతం చేసుకుంది. టాలీవుడ్ ఆడియ‌న్స్‌ని మెస్మ‌రైజ్ చేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

ప్ర‌స్తుతం తెలుగు, హిందీ భాష‌ల్లో క్రేజీ ప్రాజెక్ట్‌లు చేస్తున్న మృణాల్ గ‌త కొన్ని రోజులుగా వార్త‌ల్లో నిలుస్తోంది. కోలీవుడ్ స్టార్ ధ‌నుష్‌తో మృణాల్ గ‌త కొంత కాలంగా ప్రేమ‌లో ఉంద‌ని, వీరిద్ద‌రూ త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్త‌లు షికారు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ వార్త‌ల‌ని నిజం చేస్తూ ఇటీవ‌ల `డెకాయిట్` టీజ‌ర్ రిలీజ్ ఈవెంట్‌లో హీరో అడివి శేష్ ఇండైరెక్ట్‌గా హింట్ ఇవ్వ‌డం తెలిసిందే. త‌న‌పై వ‌స్తున్న‌ రూమ‌ర్‌ల‌పై మృణాల్ ఠాకూర్ ఇటీవ‌ల స్పందించింది.

ధ‌నుష్ త‌న‌కు మంచి మిత్రుడు మాత్ర‌మేన‌ని, అంత‌కు మించి మా ఇద్ద‌రి మ‌ధ్య ఏమీ లేద‌ని క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. అయినా స‌రే ఇద్ద‌రూ డేటింగ్‌లో ఉన్నార‌ని, ఫిబ్ర‌వ‌రి 14న వివాహం చేసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని తాజాగా మ‌రో వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. ఐశ్వ‌ర్య‌ని 2004లో వివాహం చేసుకున్న ధ‌నుష్ ఇద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా 18 ఏళ్ల వైవాహిక జీవితానికి 2022లో ముగింపు ప‌ల‌క‌డం తెలిసిందే. ఇద్ద‌రి మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చ‌డానికి ర‌జ‌నీ ఎంత ప్ర‌య‌త్నించినా లాభం లేకుండా పోయింది. ఫైన‌ల్‌గా ఇద్ద‌రు కోర్టుని ఆశ్ర‌యించ‌డంతో కోర్టు 2024లో వీరికి విడాకులు మంజూరు చేసింది.

అప్ప‌టి నుంచి పిల్ల‌ల‌తో క‌లిసి ఉంటున్న ధ‌నుష్ ..హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌తో డేటింగ్ చేస్తున్నారంటూ ప్ర‌చారం మొద‌లైంది. దానికి బ‌లాన్ని చేకూరుస్తూ తాజాగా ఫిబ్ర‌వ‌రి 14న పెళ్లి చేసుకోబోతున్నార‌ని వార్త‌లు మొద‌లు కావ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ నేప‌థ్యంలోనే మృణాల్ ఠాకూర్ మాజీ రూమ‌ర్డ్‌ బాయ్ ఫ్రెండ్స్‌కు సంబంధించిన వార్త‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. 2014 నుంచి 2016 వ‌ర‌కు టీవీ స్టార్‌గా ఉన్న స‌మ‌యంలో శ‌ర‌ద్ త్రిపాఠీ అనే వ్య‌క్తితో మృణాల్ డీప్ రిలేష‌న్‌లో ఉంద‌ట‌. ఆ త‌రువాత ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో విడిపోయార‌ట‌.

ఇక 2017 నుంచి 2018 వ‌ర‌కు `కుంకుమ్ భాగ్య`లో త‌న‌తో క‌లిసి న‌టించిన కో స్టార్ అర్జిత్ త‌నేజాతో డేటింగ్ చేసింద‌ని అప్ప‌ట్లో రూమ‌ర్‌లు వినిపించాయి. ఆ త‌రువాత 2018 నుంచి 2019 వ‌ర‌కు టెలివిజ‌న్ స్టార్ కుషాల్ టాండ‌న్‌తో క్లోజ్‌గా ఉండ‌టంతో వీరిద్ద‌రు డేటింగ్‌లో ఉన్నారంటూ ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌రువాత రాప‌ర్ బాద్ షాతో క్లోజ్‌గా ఉండ‌టం.. ప్రైవేట్ ఆల్బ‌మ్ చేయ‌డంతో 2020 నుంచి 2021 వ‌ర‌కు త‌న‌తో క్లోజ్‌గా ఉంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌రువాత బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధాంత్ చ‌తుర్వేదితో లింక‌ప్ రూమర్స్ బాలీవుడ్‌లో జోరుగా వినిపించాయి. ఆ త‌రువాత సుమంత్‌తో క‌లిసి ఉన్న ఓ ఫొటో నెట్టింట వైర‌ల్ కావ‌డంతో ఇద్ద‌రూ డేటింగ్‌లో ఉన్నారంటూ ప్ర‌చారం జ‌రిగిన విష‌యం తెలిసిందే.

ఇక ఇండియ‌న్ క్రికెట‌ర్ శ్రేయాస్ అయ్య‌ర్‌తో మృణాల్ లోప్రొఫైల్ ఎఫైర్‌ని న‌డిపిస్తోంద‌ని, ఇద్ద‌రూ డేటింగ్ చేస్తున్నార‌ని నెట్టింట ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు ధ‌నుష్ పేరు వినిపిస్తోంది. ఇంత వ‌ర‌కు ఎవ‌రి గురించి ఓపెన్‌గా మాట్లాడ‌ని మృణాల్ ఠాకూర్ ..ధ‌నుష్ గురించి మాత్రం త‌ను నాకు మంచి మిత్రుడ‌ని చెప్ప‌డం, వీరిద్ద‌రూ క‌లిసి ఫిబ్ర‌వ‌రి 14న పెళ్లి చేసుకోబోతున్నార‌ని వార్త‌లు షికారు చేస్తుండ‌టంతో మృణాల్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఫిబ్ర‌వ‌రి 14న నిజంగానే ధ‌నుష్‌, మృణాల్‌ని పెళ్లి చేసుకుంటాడా? అని ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ స‌స్పెన్స్‌కు తెర‌ప‌డాలంటే ధ‌నుష్ స్పందించాల్సిందేన‌ని కోలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

Tags:    

Similar News