మెగాస్టార్ పెళ్లిరోజు.. రామ్ చరణ్ విషెస్.. ఏం చెప్పాడో తెలుసా?
ఇవాళ మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతుల పెళ్లి రోజు. 1980 ఫిబ్రవరి 20న చిరంజీవి, సురేఖ వివాహం జరిగింది. సురేఖ అలనాటి ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమార్తె. సుప్రీం హీరో మెగాస్టార్ గా ఎదుగుతున్న తరుణంలో ఈ వివాహం జరిగింది. వీరిద్దరూ ఒక్కటై నేటితో 42 సంవత్సరాలు పూర్తయ్యాయి.
ఎంతో ప్రత్యేకమైన ఈ రోజున తన తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశాడు రామ్ చరణ్. ఈ మేరకు చిరంజీవి-సురేఖ నిరాడంబరంగా ఇంటి ముందు కూర్చున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు చెర్రీ. ‘నా అతిపెద్ద బలం మీరే. మీ ఇద్దరికీ 42వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశాడు రామ్‌చరణ్.
ప్రస్తుతం చిరు కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇది పూర్తికాగానే.. లూసీఫర్ రీమేక్ లో అడుగు పెట్టనున్నాడు మెగాస్టార్. ఇక, రామ్ చరణ్ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత సౌతిండియా స్టార్ డైరెక్టర్ శంకర్‌తో కలిసి ప్రతిష్టాత్మక చిత్రంలో నటించబోతున్నాడు.